విశాఖపట్నంలోని గాయత్రి విద్యా పరిషత్ రిషి కొండ శాఖ లో నూతనంగా స్థాపించబడిన క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఫర్ జెన్- జెడ్ (Quantum Computing for Gen-Z అనే మూడు రోజుల సదస్సు ఫిబ్రవరి 23 నుండి 25, 2026 వరకు విజయవంతంగా నిర్వహించబడింది. విద్యార్థుల్లో ఆధునిక క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన, ఆసక్తి మరియు పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది.ఈ సదస్సు క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ యొక్క తొలి ప్రధాన శైక్షణిక కార్యక్రమంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవనీయులైన ఆచార్య పి.వి శర్మ గారు, సభ్యులు, గాయత్రి విద్యా పరిషత్, ప్రిన్సిపాల్ ఆచార్య కె.ఎస్.బోస్ గారు, ఆచార్య పి.వి.వినయ్ గారు ఇంజనీరింగ్ డీన్, విభాగాధిపతులు, అధ్యాపక వర్గం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ యొక్క లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వివరించబడిందిమొదటి రోజు డా.ఎస్ .కాంతి కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ వారు క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక అంశాలను సులభంగా వివరించారు.రెండవ రోజు ప్రొఫెసర్ జి. సుధీర్ గారు, వైస్ ప్రిన్సిపాల్ మరియు గణిత శాస్త్రవేత్త, సంక్లిష్ట సిద్దాంతాలను సులభంగా వివరించి విద్యార్థుల అవగాహనను పెంపొందించారు.మూడవ రోజు ఆచార్య పి.స్వప్న , హెడ్ మరియు అసిస్టెంట్ ప్రిన్సిపాల్, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ విభాగం, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ వారు సిద్ధాంతాన్ని ప్రాయోగిక అవకాశాలతో అనుసంధానం చేస్తూ ఉన్నత విద్య, ఇంటర్న్ షిప్‌లు మరియు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై మార్గదర్శకత్వం అందించారు.
ముగింపు కార్యక్రమంలో కన్వీనర్ డా. శ్రీదేవి గారు సదస్సు నివేదికను సమర్పించి, కార్యక్రమ లక్ష్యాలు మరియు ఫలితాలను వివరించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అతిథులు అభినందించారు. పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయబడింది.
ఈ సదస్సులో ఆచార్య ప్రగడ రాజ గణపతి, సభ్యులు, గాయత్రి విద్యా పరిషత్,కళాశాల, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బోస్ గారు, ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ పి.వి. వినయ్, శ్రీయితులు డి.గిరిథర్ యి.జి డైరెక్టర్,విభాగాధిపతులు, అధ్యాపకులు వివిధ విభాగాలకు చెందిన మొత్తం 196 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలపై విద్యార్థుల్లో విశేషమైన అవగాహన మరియు ఆసక్తి పెంపొందించడంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది.






Comments
Post a Comment