అమలాపురంలో జనసేన సభ్యత్వ నమోదు 'ఉద్యమి జనసైనికులు ఉత్సహంగా పాల్గొనాలి పార్లమెంటు ఇంఛార్జి బత్తుల బలరామకృష్ణ కూటమి పొత్తు ప్రకారమే స్థానిక ఎన్నికల్లో పోటీ
అమలాపురం:.విశాఖ సందేసం: డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో జనసేన సభ్యత్వ నమోదు 'ఉద్యమి ' కార్యక్రమాన్ని పార్లమెంటు ఇంఛార్జి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. బోడసకుర్రు బి ఆర్ కె ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ స్థాయి జనసైనికులు సమావేశం సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్, ఆర్.డి.ఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో
రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్, నియోజకవర్గ ఇంచార్జులు పాల్గొన్నారు. సభ్యత్వ ప్రకీయపై క్షేత్రస్థాయి కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని నల్లా శ్రీధర్ అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ సభ్యత్వంతో పాటు అయిదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. జనసైనికుల నుండి సభ్యత్వం కోసం 400 రూపాయల రుసుము వసూలు చేస్తున్నామని చెప్పారు.అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇంచార్జి ను కార్యవర్గాన్ని త్వరలో పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తారని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికులు పోటీలో ఉంటారని ఎవరికి ఎన్ని స్థానాలు అనేది కూటమి నేతలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు గతంలో కంటే రెండు రెట్లు పెంచడానికి కృషి చేస్తున్నామని పార్లమెంటు ఇంఛార్జి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు.


Comments
Post a Comment