Skip to main content

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు.

చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం నిజమైన సేవాస్ఫూర్తికి నిదర్శనం అని అన్నారు.

ఈ ఆరోగ్య మందిరం ద్వారా వేదుళ్ల నరవ మరియు పరిసర ప్రాంతాల గ్రామాలకు చెందిన రెండు వేల మందికి పైగా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రులు మరియు పాఠశాలలను ప్రతి ఒక్కరూ దేవాలయాలుగా భావిస్తారని పేర్కొంటూ, ఈ ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగి ఆరోగ్యంగా, సంతోషంగా తిరిగి వెళ్లేలా సేవలు అందించాలని కోరారు.

ఈ ఆసుపత్రికి సంబంధించి ఎటువంటి అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని, తాను తప్పకుండా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సేవా సంకల్పానికి ప్రతీకసమాజంలోని అవసరమైన వారికి ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే సేవా సంకల్పంతో గాజువాక పరిధిలోని వేదుళ్ల నరవ గ్రామంలో “శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం” నిర్మించబడింది.

ఈ ఆరోగ్య కేంద్ర నిర్మాణం వెనుక వాల్టేర్ అప్లాండ్స్ శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యురాలు శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారి విశేషమైన సేవా తపన ఉందని శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు తెలిపారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లి ఈశ్వరమ్మ గారు కోరిన “ఒక గ్రామానికి స్కూలు, ఒక గ్రామానికి ఆసుపత్రి, ఒక గ్రామానికి తాగునీరు” అనే సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకొని గృహలక్ష్మి గారు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఇందులో భాగంగా ఆమె

• పాడేరు ప్రాంతంలో తాగునీటి ప్రాజెక్ట్ ప్రారంభించారు

• వెంకటపతిపాలెం గ్రామంలో ఎంపీపీ పాఠశాల నిర్మాణానికి సహాయం చేశారు

• గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు.

వేదుళ్ల నరవ గ్రామస్తులు ఆసుపత్రికి వెళ్లాలంటే 7–8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలియజేయడంతో ఈ ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేపట్టబడింది.ఆరోగ్య మందిరం వివరాలుపార్టీల కతీతంగా గ్రామస్థులు స్థలాన్ని అందించగా శ్రీ సత్య సాయి బాబా వారి భక్తురాలు శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారు తన స్వంత నిధులతో 33.5 లక్షల వ్యయంతో నిర్మించారు

2023లో శంకుస్థాపన జరిగిన ఈ భవనం రూ.33.5 లక్షల వ్యయంతో నిర్మించబడింది.

సుమారు 1443 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రంలో

• డాక్టర్ గది

• డిస్పెన్సరీ

• ల్యాబ్

• ఇతర గదులు

• ఒక హాల్

మొత్తం 5 గదులు నిర్మించబడ్డాయి.

డాక్టర్ టేబుల్, కుర్చీ, రోగుల కోసం బెంచీలు మరియు కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ భవనం డీఎంహెచ్ఓ ప్రణాళిక ప్రకారం నిర్మించబడింది.

చివరగా ఈ నూతనంగా నిర్మించిన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించారు.

________________________________________

సేవా కార్యక్రమాలు

ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన పూజా కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు పాల్గొన్నారు.

ఆ సందర్భంగా ఆయన

• స్క్రీన్ మరియు టెక్స్టైల్ ప్రింటింగ్ శిక్షణ పొందిన మహిళలకు ప్రత్యేక కిట్లు అందజేశారు

• అవసరమైన గ్రామస్తులకు “శ్రీ సత్యసాయి అమృత కలశం” నెలసరి అవసరాల రేషన్ కిట్లు పంపిణీ చేశారు.

ప్రతి శిక్షణ కిట్‌లో

• 5 రకాల ఫ్రేములు

• 7 రకాల కలర్ బాటిళ్లు

• గోల్డ్ మరియు మెటాలిక్ పేస్ట్‌లు

• ప్రాక్టీస్ క్లాత్

అందజేశారు.

________________________________________

పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో

• శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు గారు, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖ జిల్లా

• శ్రీ కె. అప్పలనాయుడు గారు, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – అనకాపల్లి జిల్లా

• డా. పి. జగదీశ్వరరావు గారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి, విశాఖపట్నం

• శ్రీ మొల్లి ముత్యాల నాయుడు గారు, జీవీఎంసీ వార్డు కార్పొరేటర్

తో పాటు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మరియు జిల్లా స్థాయి పదాధికారులు, సేవాదళ సభ్యులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments