రోజు డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అధ్యక్షతన ART, సరోగసి బృందం తో కలిసి కింగ్ జార్జ్ హాస్పిటల్ గైనిక్ విభాగం నందు డా.సౌమిని, గైనిక్ విభాగాదిపతి వారి అధ్వర్యంలో తనిఖీ చేసారు. ఈ తనిఖీ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డా.పి.జగదీశ్వర రావు వారు వార్డ్, స్కానింగ్ మెషిన్ తనిఖీ చేసారు. ART లెవెల్-1 కేంద్రము నిర్వహణకు డాక్టర్స్, స్టాఫ్ యొక్క విద్యార్హతలు, ల్యాబ్ పరికరములు పరిశీలించి తగు సలహాలు ఇచ్చారు.
ఈ తనిఖీ బృందం లో డా.విద్యారమ, గైనకాలజిస్ట్, VGH, డా.వందనశశికిరణ్, రేడియోలజిస్ట్, డా.టి.కిషోర్, పెధాలజిస్ట్, డా.శోభశ్రీ, సోషియాలజిస్ట్, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీమతి ఎల్.వి.రమణి, NGO, గాయత్రి వెల్ఫేర్, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఓ, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, శ్రీ కె.శివాజీ, మానిటరింగ్ కన్సల్టెంట్ మొదలగు సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రము డా.సౌమిని వారి అధ్వర్యంలో డా.పి.జగదీశ్వర రావు వారి పర్యవేక్షణలో 7 గురు సభ్యుల బృందం తనిఖీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వారి అనుమతులు అందిన వెంటనే ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలియచేసారు. దీనికి అవసరమైన పరికరాలను ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AMCOSA) వారి సమకూర్చారని డా.సౌమిని వారు తెలియచేసారు.
డా.పి.జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం




Comments
Post a Comment