ఈ రోజు అనగా 07.04.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుండి సత్యం కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ని డా.పి.జగదీశ్వర రావు వారు జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క నినాదం “విజ్ణానానికి అండగా నిలుద్దాం-ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దాం”
ఈ ఆరోగ్య దినోత్సవం 1948 వ సంవత్సరం లో ప్రారంభం అయిందని, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 07 వ తేదిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు సాధ్యమైనంతవరకు మంచి నీరు త్రాగుట, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించుట మరియు ఆరోగ్యకరమైన ఆహారం భుజించుట, చక్కని గాలి, 
ఈ ఆరోగ్య దినోత్సవం 1948 వ సంవత్సరం లో ప్రారంభం అయిందని, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 07 వ తేదిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు సాధ్యమైనంతవరకు మంచి నీరు త్రాగుట, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించుట మరియు ఆరోగ్యకరమైన ఆహారం భుజించుట, చక్కని గాలి, వెలుతురు ఉన్న ప్రదేశములలో నివసించుట, నివశించే ప్రదేశములలో క్రిమికీటకాలు లేకుండా చూసుకొనుట, వీటి వలన ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకొనుట వలన ఏ విధమైనటువంటి వ్యాదులకు గురి కాకుండా ఉంటారని మరియు తల్లి బిడ్డ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త వహించాలని తెలియచేశారు.

ఈ ర్యాలీ లో డా.లూసి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి, డా.బి.హారిక, ఆర్.బి.ఎస్.కె.జిల్లా సమన్వయకర్త, డా.జగదీష్ ప్రసాద్, డి.ఎస్.ఓ. ఇతర ప్రోగ్రాం అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సం/-డా.పి..జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం


Comments
Post a Comment