Skip to main content

కోడూరుపాడు సీతారాంపేటలో ఘనంగా డా.బిఆర్ అంబేద్కర్135వ జయంతి, బాబు జగజ్జివన్ రావు 119వ జయంతి వేడుకలు....


 అల్లవరం, విశాఖ సందేసం
....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు సీతారాంపేట ఎమ్మార్పీఎస్ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి బాబు జగజ్జివన్ రావు 119వ జయంతి వేడుకలను ఆదివారం  ఘనంగా నిర్వహించారు.


ఈ వేడుకలకు  ముఖ్య అతిథులుగా అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, సీఐ ప్రశాంత్ కుమార్ పాల్గొని 


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలదండల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితం కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వర్గాల సామాజిక సామర్థ్యం కోసం వారి హక్కుల కోసం తన జీవితాంతం అలుపెరుగని పోరాటం చేశారని ఆయన కొనియాడారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ బాబు జగజ్జివన్ రావు వంటి మహనీయులను పూర్తిగా తీసుకుని దళితుల అభ్యున్నతికి నిరంతర కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. 


దళిత సామాజిక అంతా విభేదాలు విడి ఐక్యతగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ ఫలాల వల్లే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పంచాయతీ సర్పంచ్ గ్రామ వార్డు వివిధ రకాల రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామని యువకులు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని తెలియజేశారు

           Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.