కువైట్ దేశంలో ప్రపంచ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి..... బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం.....
అమలాపురం, విశాఖ సందేసం.....ప్రపంచమే మేధావిగా గుర్తించిన భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎడారి దేశం కువైట్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. డా.బి.ఆర్.అంబేద్కర్గారి 135 వ జయంతి పురస్కరించుకుని బహుజన ఐక్యవేదిక కువైట్ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరాన్ని కువైట్ దేశంలో జాబ్రియా ప్రాంతంలో నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో సుమారు 40 మందికి పైగా బ్లడ్ డొనేట్ చేసి డా. బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బహుజన ఐక్యవేదిక సభ్యులు మారే శేఖర్, రాజకుమార్,రవి శ్రీ మాట్లాడుతూ దేశం కాని దేశంలో మాకు దేవుడితో సమానమైన డా.బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను రక్తదాన కార్యక్రమంతో చేసుకోవడం చాలా సంతోషాన్ని Biochemistry. ఏప్రిల్ 14 నా జరగబోయే డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి ని కూడా ఘనంగా విజయవంతం చెయ్యాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మారే శేఖర్, రాజకుమార్, రొక్కం సంపత్, రవి శ్రీ,యాలంగి రాజు, వస్కా రమేష్, ఉదయ్ కుమార్,బుంగా ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment