K V SHARMA EDITOR
విశాఖపట్నం, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ భారతదేశానికి చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని, దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం అందరికీ మార్గదర్శకంగా నిలిచిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, డివి రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, పి నల్లన్నయ్య , జోనల్ కమిషనర్ బి.రాము , అధికారులు, ఉద్యోగులు, సంఘ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన అమూల్య సేవలు చిరస్మరణీయమని, భారత రాజ్యాంగ రూపకర్తగా డా. బి.ఆర్. అంబేద్కర్ దేశానికి ప్రజాస్వామ్య పునాది వేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత వంటి ఆయన ఆశయాలు నేటికీ ప్రజా పరిపాలనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని,ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం అందరికీ మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. విద్యను అభ్యసించండి , హక్కుల కోసం చైతన్యాన్ని పెంపొందించుకోండి, సంఘటితశక్తిగా ముందుకు సాగండి అనే సూక్తులు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయన్నారు .అలాగే ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరు తమ విధుల్లో ఆచరించి సమానత్వం, సమగ్ర అభివృద్ధి సాధనకు కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
అనంతరం జీవీఎంసీ అధికారులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రతిపాదించిన విలువలను పాటిస్తూ సమగ్ర నగర అభివృద్ధి దిశగా కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు ,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.


Comments
Post a Comment