విశాఖపట్నం, ఏప్రిల్ 22: జివిఎంసిలో కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ తమ సంస్థ కొరకు నిబద్దతతో విధులు నిర్వహించి జివిఎంసి కి మంచి గుర్తింపు తీసుకురావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు
. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో జీవీఎంసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన 15 మంది కుటుంబ సభ్యులకు 4వ తరగతి ఉద్యోగులుగా నియామక పత్రాలను జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తో కలిసి అందించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ లో ఉద్యోగం చేస్తూ మరణం పొందిన కుటుంబ సభ్యులకు 15 మందికి జివిఎంసిలో నాలుగో తరగతి ఉద్యోగులుగా నీయామాపకం పత్రాలను అందించామని తెలిపారు. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ సంస్థ కొరకు నిబద్దతతో పని చేయాలని తెలిపారు.
జీవీఎంసీ అంటే ప్రజలకు సర్వీసులు అందించే సంస్థని, నిత్యం ప్రజా సేవ కొరకు అధికారులు చెప్పిన ప్రతి పనిని సకాలంలో పూర్తిచేసి సంస్థకు, అధికారులకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే చిత్తశుద్ధి తో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణ లో ప్రత్యెక నైపుణ్యతను పెంపొందించుకోవాలని కమీషనర్ వారికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పి. పద్మజ తదితరులు పాల్గొన్నారు పౌర సంబంధాల అధికారి, జివిఎంసి
K.V.SHARMA EDITOR




Comments
Post a Comment