Skip to main content

తూర్పు జోన్ లో ఏప్రిల్ 16న బహిరంగ వేలం

 


విశాఖపట్నం ఏప్రిల్ 13 : మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ తూర్పు జోన్ పరిధిలో ఖాళీగా వున్న షాపు  రూములు, కళ్యాణ మండపములు, ఖాళీ స్థలం లకు ఏప్రిల్ 16న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడునని  తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

తూర్పు జోన్ పరిధిలో గల ఖాళీగా వున్న షాపు రూములు, కళ్యాణ మండపములు, ఖాళీ స్థలం లకు 3  సంవత్సరముల కాలమునకు గుత్తలకు ఇచ్చుటకు గాను తేది: 16-04-2026 న ఉదయం 11 గంటలకు తూర్పు జోనల్  కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని, ఆసక్తి గల పాటదారులు పూర్తి వివరాలకు తూర్పు జోనల్  కమిషనర్ కార్యాలయం లోని పని వేళలో కార్యలయ పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్  తెలియజేశారు.

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ

Comments