Skip to main content

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 16.04.2026

              

ఈ రోజు అనగా 16.04.2026 న టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీ కృష్ణ యాదవ్ వారు వారి కార్యాలయంలో జిల్లా టిబి నివారణ అధికారి డా.రోణంకి రమేష్ వారితో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. 

గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ టిబి రహిత భారత దేశాన్ని నిర్మించాలంటే ప్రజలందరూ ఈ కార్యక్రమలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఎవరైనా రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, రాత్రి సమయంలో చెమటలు పట్టడం, అలసట, ఖఫంలో రక్తపుచారలు కనబడుట వంటి లక్షణములు ఉన్నట్లయితే సమీపములో గల ఆరోగ్య కేంద్రమును సందర్శించి తగు పరీక్షలు చేయిచుకోవాలని సూచించారు.

TBMBA 2.0 కార్యక్రమంలో ధూమపానం అలవాటు ఉన్నవారు 60 సం”ల వయస్సు పైబడిన వారు, డయాబెటిస్ వ్యాదిగ్రస్తులు, పాత టిబి వ్యాధి సోకినవారు మరియు BMI 18 కంటే తక్కువ ఉన్నవారు టిబి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఖఫం మరియు ఎక్ష్-రే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు 

ఈ కార్యక్రమంలో జిల్లా టిబి నివారణ అధికారి డా.రోణంకి రమేష్ వారు మరియు వారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.  
  

 సం/-డా.పి..జగదీశ్వర రావు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                               విశాఖపట్నం

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.