Skip to main content

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 16.04.2026



ఈ రోజు అనగా 16.04.2026
 న : ఈ సమావేశాన్ని ఉద్దేశించి డా.ఎన్.రమారెడ్డి వారు మాట్లాడుతూ ఈ చందనోత్సవానికి ఎవరికీ కేటాయించిన వారి మెడికల్ క్యాంపుల నందు డాక్టర్లు, సిబ్బంది తప్పైసరిగా విధులకు అందుబాటులో ఉండాలని, పర్మిషన్ లేకుండా ఎవరూ మెడికల్ క్యాంపు లు విడిచి బయటకు వెళ్లరాదని, ఏదైనా సమస్య వచ్చినట్లయితే సంబందిత ప్రోగ్రాం అధికారులకు తెలియచేసి తగు చర్యలు గైకోనాలని, కనుక మెడికల్ క్యాంపులు కేటాయించిన వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని, కొండ ఎగువ భాగము, దిగువ భాగము మరియు తోలి పాల్వంచ, 500 మెట్లు, రాజగోపురం, పాత శివాలయం మొదలగు ప్రాంతాలలో కేటాయించిన మెడికల్ క్యాంపు లు ప్రజలు సద్వినియోగం అయ్యేలా చూడాలని తెలియచేసారు.

            డా.పి..జగదీశ్వర రావు

                 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                                            విశాఖపట్నం

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.