ఈ రోజు అనగా 16.04.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయ సమావేశ మందిరంనందు ఈ నెల 20 న జరుగబోవు సింహాచలం దేవస్థానం చందనోత్సవం కార్యక్రమము వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ క్యాంపు లు నిమిత్తం జిల్లా ప్రోగ్రాం అధికారులకు, పట్టణ, ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం నందు డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది ఈ చందనోత్సవమునకు సహకరించాలని మరియు సిబ్బంది అందరూ ఒక గంట ముందు అనగా 19 వ తేది రాత్రి 08:00 గంటల నుండి 20 వ తేది రాత్రి కార్యక్రమం ముగిసే వరకు షిఫ్ట్ ల వారీ అందరూ పని చేయాలనీ ఎవరికీ సెలవులు అనుమతించబడవని తెలియచేసారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి డా.ఎన్.రమారెడ్డి వారు మాట్లాడుతూ ఈ చందనోత్సవానికి ఎవరికీ కేటాయించిన వారి మెడికల్ క్యాంపుల నందు డాక్టర్లు, సిబ్బంది తప్పైసరిగా విధులకు అందుబాటులో ఉండాలని, పర్మిషన్ లేకుండా ఎవరూ మెడికల్ క్యాంపు లు విడిచి బయటకు వెళ్లరాదని, ఏదైనా సమస్య వచ్చినట్లయితే సంబందిత ప్రోగ్రాం అధికారులకు తెలియచేసి తగు చర్యలు గైకోనాలని, కనుక మెడికల్ క్యాంపులు కేటాయించిన వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని, కొండ ఎగువ భాగము, దిగువ భాగము మరియు తోలి పాల్వంచ, 500 మెట్లు, రాజగోపురం, పాత శివాలయం మొదలగు ప్రాంతాలలో కేటాయించిన మెడికల్ క్యాంపు లు ప్రజలు సద్వినియోగం అయ్యేలా చూడాలని తెలియచేసారు. -డా.పి..జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment