ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఏప్రియల్ 16: ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా గురువారం ఏయూ అనుబంధ కళాశాల ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు వినూత్నంగా ఏయూకు శుభాకంక్షలు అందిచారు.
K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం,ఏప్రియల్16:ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా గురువారం ఏయూ అనుబంధ కళాశాల ఎలియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు వినూత్నంగా ఏయూకు శుభాకంక్షలు అందిచారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎంతోకళాత్మకంగా ఫుడ్ కార్వింగ్ తీర్చిదిద్దారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలను ఉపయోగించి దీనికి తయారు చేశారు. పండ్లు, కూరగాయలను ఉపయోగించి అందమైన పుష్పగుచ్చాలు, హంసలు, కేక్ వంటివి సిద్దం చేశారు. ఈ సందర్భంగా హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న విద్యార్థులను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. తాము నేర్చుకున్న అంశాలను కార్యరూపంలో చూపడంతో పాటు, ఎంతో కళాత్మకంగా విశ్వవిద్యాలయ వందేళ్ల వేడుకను చూపే ప్రయత్నాన్ని ప్రశంసించారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది రవి, ఎం.శశి, జి.గిరిజా శంకర్, కె.నగరాజ కుమారి, ఆర్.పద్మశ్రీ, కె.సీతామాణిక్యం, ఎలియన్స్ కళాశాల డైరెక్టర్ కె.సతీష్, ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్, ఏయూ డీన్‌లు, ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment