Skip to main content

జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది: 18.04.2026


ఈ రోజు అనగా 18.04.2026 న టిబి ముక్త్ భారత్ అభయాన్ 2.0 (TBMBA) కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమిలి నియోజకవర్గం “MLA - గారు  “శ్రీ గంటా శ్రీనివాస రావు" గారు టిబి వ్యాధి పై అవగహన కార్యక్రమం లో పాల్గొని గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది.

MLA గారు మాట్టాడుతు టిబీ రహిత భారతదేశాన్నినిర్మించాలంటే ప్రజలందరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఎవరికైన రెండు వారాలకి మించిన దగ్గు, జ్వరం, బరువుతగ్గడం, అకలి మందరించడం, రాత్రి చెమటలు పట్టడం, అలసట, కఫంలో రక్తపు చారలు కనబడిన యెడల వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్నిసందర్శించి తగు పరిక్షలు చేయించుకోవాలని సూచించారు.

TBMBA 2.0 కార్యక్రమంలో ధూమపానo అలవాటు ఉన్నవారు, 60 సంవత్సరాల వయస్సు పైబడినవారు, డయాబటిక్ వ్యాదిగ్రస్తులు, పాత టిబి వ్యాధి సోకిన వారు మరియు BMI 18 కoటే తక్కువ ఉన్నవారు టిబి వ్యాధి నిర్థారణ పరిక్షల కోసం కఫం మరియు X- Ray పరిక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యాక్రమంలో జిల్లా టిబి వివారణ అధికారి డా.రోణంకి రమేష్ వారు యొక్క సిబ్బంది పాల్గోన్నారు

    జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

 విశాఖపట్నం      

                 K.V.SHARMA  EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.