Skip to main content

ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి 19.04.2026 ఎండలో నీడగా… దాహంలో చల్లదనంగా… సాయి యువత సేవ” - మానవసేవయే మాధసేవ అన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశాన్ని ఆచరణలో చూపిన ఉక్కునగరం శ్రీ సత్య సాయి యువత


భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి “అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు” అన్న దివ్య సందేశం స్ఫూర్తిగా, 15వ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్య సాయి సేవా సమితి ఉక్కునగరం యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు విశిష్టమైన సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

ఎండ తీవ్రతతో అలసిపోయిన బాటసారులకు ఉపశమనం కలిగించాలనే తపనతో దేశపాత్రునిపాలెం, అగనంపూడి, రాజీవ్ నగర్ (కూర్మన్నపాలెం), ఉక్కునగరం జంక్షన్ ప్రాంతాలలో శ్రీ సత్య సాయి యువత, సేవాదళ్ సభ్యులు ప్రేమతో సేవ అందించారు.


ఈ సేవలో విశేషత ఏమిటంటే — సేవాదళ సభ్యులు స్వయంగా బాటసారులకు కొత్త చెప్పులు తొడిగించి, వారి పాదాలకు ఉపశమనం కలిగించారు. అలాగే కొత్త గొడుగులను అందించి, ఎండ తీవ్రత నుండి రక్షణ కలిగించారు. ఇది కేవలం సేవ కాదు — అది ప్రేమకు ప్రతిరూపం.


అదేవిధంగా పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది. సుమారు 20 లీటర్ల పెరుగుతో చల్లటి మజ్జిగ తయారుచేసి, ఎండలో ప్రయాణించే వారికి పంచి వారి దాహాన్ని తీర్చారు.


ఈ సేవా కార్యక్రమంలో ఉక్కునగరం యువజన విభాగం లీడర్ శ్రీ కె. ప్రకాష్, శ్రీ కె. రామచంద్రరావు, జాయింట్ కన్వీనర్ శ్రీ కె.వి. రమణ, మహిళా యువజన నాయకురాలు కుమారి సాయి విద్య, అలాగే శ్రీ కె. దివాకర్, పరశురాం, పాండురంగ తదితరులు పాల్గొన్నారు.

ఈ సేవా కార్యక్రమం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ప్రార్ధించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అన్న దివ్య సందేశంకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.

                  K.V.SHARMA  EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.