సెన్సెస్ 20 27 స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్ ) చాలా సులభం. *స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.
K.V.SHARMA EDITOR
విశాఖపట్నం, ఏప్రిల్ 16: భారతదేశ జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రభుత్వం సూచించిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) కార్యక్రమంలో పాల్గొనబోతున్న ప్రజలు స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చాలా సులభంగా చేసుకోవచ్చునని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం ఆయన తన నివాసంలో స్వయంగా తన మొబైల్ ఫోన్లో https://se.census.gov.in వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకుని తన పేరుతో సహా సంబంధిత అంశాలను పొందుపరిచి అందరికీ స్ఫూర్తినిచ్చారు.
ఈ సందర్భంలో కమిషనర్ మాట్లాడుతూ సెన్సస్ 2027 లో భాగంగా ప్రభుత్వం సూచించినసెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) కార్యక్రమం ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు జరుగుతుందని, మొట్టమొదటిసారిగా సెన్సెస్ 20 27 కార్యక్రమం లో డిజిటల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని,సెల్ఫ్ ఎన్యుమరేషన్ అతి సులభంగా https://se.census.gov.in వెబ్సైట్ లో పౌరులందరూ నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈరోజు తను సెల్ఫ్ ఎన్యుమరేషన్ అతి సులభంగా చేసుకున్నానని తన ఫోటోను ప్రదర్శిస్తూ అందరికీ స్ఫూర్తిని కలిగించారు.
కావున ప్రజలందరూ భారతదేశ జనగణన 2027 కార్యక్రమంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ కు సంబంధిత అంశాలను https://se.census.gov.in వెబ్సైట్ ద్వారా అతి సులభంగా ఉన్న అంశాలకు సమాధానాలను పొందుపరిచి సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో నమోదు చేసుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కల్పించినందున ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కె .శివప్రసాద్, ఎన్యూమరేటర్ , జీవీఎంసీ సహాయక ఇంజనీర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ.



Comments
Post a Comment