అమలాపురం: విశాఖ సందేసం:నిరుద్యోగ యువతకు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వికాస, స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాలను నిర్వహిస్తుంది. అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో వికాస స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వికాస డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మరియు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో అన్నిచోట్ల నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 17 కంపెనీల హెచ్ఆర్ లతో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సుమారు 500 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 200 మంది ఉద్యోగాలు సాధించి కంపెనీ జాయినింగ్ లెటర్స్ అందుకున్నారని తెలిపారు. జిల్లాలో జరిగే జాబ్ మేళాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ అన్నారు. కరాటం ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చాలా జాబ్ మేళాలు నిర్వహించిమని, ఈ జాబ్ మేళాను తమ కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
జాబ్ మేళా నిర్వహించిన అధికారులు ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కెవిఆర్ నరసింహారావు, ప్లేస్మెంట్ అధికారులు ప్లేస్మెంట్ అధికారులు వై. వరప్రసాద్, బి. శ్రీనివాస్ సిహెచ్ జాన్ పాల్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రాజేంద్ర ప్రసాద్, హరి, శంసున్, కె శ్రేవాంధలి అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant

Comments
Post a Comment