Skip to main content

*వైసీపీకి అధికారం పోయిన అహంకారం తగ్గలేదు* *గత పాలనలో అన్ని వర్గాలను భయపెట్టారు*. *జగన్ అధికారం లేనప్పుడు అమరావతి రాజధాని అన్నాడు*. *అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నాడు*. *అమరావతి రైతులను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు*. *జగన్ మానసిక పరిస్థితి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి*. *2019-2024 వరకు విధ్వంసం జరిగింది*. *ఎన్ డి ఏ ప్రభుత్వం -ప్రజా ప్రభుత్వం*.. *హోం మంత్రి అనిత*

                Dr Nanduri Ramakrishna 

                        Sr Sub EDITOR 


విశాఖపట్నం, ఏప్రిల్ 11:-వైసీపీకి అధికారం పోయిన అహంకారం తగ్గలేదని,గత పాలనలో అన్ని వర్గాలను భయపెట్టారని హోం మంత్రి అనిత అన్నారు. జగన్ అధికారం లేనప్పుడు అమరావతి రాజధాని అన్నారని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని చెప్పి, ఇప్పుడు మావిగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనత మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఏర్పడతాయని, అయితే వైసీపీ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని అనిత అన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ జరిగిందన్నారు.


 అధికారంలోకి వస్తే వినాశనం చేస్తామని చెప్పడం బాధాకరమని పేర్కొన్నారు.జగన్‌ అధికారంలోకి రావడానికి అనేక అడ్డదారులు తొక్కారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని  వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇతర సంఘటనలను ప్రస్తావిస్తూ అప్పట్లో ప్రజలను తప్పుదోవ పట్టించారని, కానీ ప్రస్తుతం ప్రజలు నిజాన్ని గ్రహించారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలను ప్రస్తావిస్తూ, చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పోలీసు వ్యవస్థ చట్టపరంగా పనిచేస్తుందని, ఎలాంటి అరాచకాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.


సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలను నియంత్రించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. జర్నలిజం బాధ్యతాయుతంగా ఉండాలని, అసత్య ప్రచారాలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ కక్షతో కాకుండా చట్టం ప్రకారం మాత్రమే ప్రభుత్వం ముందుకు సాగుతుందని, అభివృద్ధి దిశగా చర్యలు కొనసాగుతాయని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Comments