Skip to main content

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు, గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన గొప్ప సదవకాశం. *2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలు పై 50 శాతం వడ్డీ మాఫీ ను పొడిగిస్తూ 2026 ఏప్రిల్ 30వ తేదీలోగా ఏక మొత్తంలో చెల్లించుకునే సదవకాశం. *2026-27 ఆర్థిక సంవత్సరము యొక్క ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30 లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటు అవకాశం. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

              DrNanduri Ramakrishna 

                        Sr Sub EDITOR 


విశాఖపట్నం ,ఏప్రిల్ 11: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు, గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సదవకాశాలను కల్పించిందని, 2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలు పై 50 శాతం వడ్డీ మాఫీ ను పొడిగిస్తూ 2026 ఏప్రిల్ 30వ తేదీలోగా ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించుకునే మరొక అవకాశాన్ని కల్పించిందని, అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరమునకు సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30 లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటు ను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని, ఈ సదవకాశాలను మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో గల ఆస్తిపన్ను దారులు, గృహ యజమానులు తప్పకుండా వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ వివరిస్తూ..,మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని గృహ యజమానులకు / ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారు తేది 31.03.2026 లోగా ఆస్తిపన్ను బకాయిలు ఏక మొత్తము ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం నగర ప్రజలకు విదితమేనని , ఈ సదవకాశం వినియోగించుకొన లేకపోయిన ఆస్తిపన్ను చెల్లింపుదారులకు మరొకసారి ఈ అవకాశం కల్పిస్తూ, సదరు గడువు తేది 30.04.2026 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మెమో నెం. 3161714/సి2/2026 యం.ఎ.&యు.డి. (సి2) డిపార్టుమెంటు, తేది 01.04.2026 ద్వారా ఉత్తర్వులు జారీచేసియున్నారన్నారు.. కావున, ఆస్తిపన్ను బకాయిదారులు అందరూ ఈ సదవకాశం వినియోగించుకొని జి.వి.యం.సి.కి చెల్లించవలసిన ఇంటిపన్ను , ఖాళీ స్థలాల పన్ను బకాయిలు తేది 30.04.2026 లోగా చెల్లించి 50 శాతం వడ్డీ రాయితీ లబ్ధిని పొందవలసినదిగా కోరడమైనదన్నారు .

అలాగే ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం 1955, సెక్షన్ 264 (3) అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరము నకు సంబంధించిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30 లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటు ను రాష్ట్ర ప్రభుత్వం కల్పించినదని, కావున ఆస్తిపన్ను చెల్లింపుదారులు, గృహ యజమానులు 2026-27 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అనగా తేది 01.04.2026 నుండి తేది 31.03.2027 వరకు గల సంవత్సర కాలమునకు చెల్లించవలసిన ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించి తమ ఆస్తిపన్ను డిమాండ్ పై 5 శాతం రిబేటు ను పొందవలసినదిగా కోరడమైనదన్నారు.

కావున  విశాఖ నగర  పరిధిలోని  గృహ యజమానులు  / ఆస్తిపన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం వారు కల్పించిన ఈ సదావకాశములు వినియోగించుకొని జి.వి.యం.సి.కి చెల్లించవలసిన  ఇంటిపన్నులు, ఖాళీ జాగా పన్నుల బకాయిలు వెంటనే చెల్లించి 50 శాతం  వడ్డీ మినహాయింపును అలాగే  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి , ఖాళీ స్థలాల పన్నుపై  5 శాతం రిబేటును పొంది నగర అభివృద్ధిలో భాగస్వాములు కావలసినదిగా కోరడమైనదన్నారు. 

జి.వి.యం.సి. సౌకర్యం కేంద్రములలో నగదు /డి.డి./చెక్కు మరియు డెబిట్ /క్రెడిట్ కార్డుల ద్వారా మరియు జి.వి.యం.సి. వెబ్ పోర్టల్ వివరములు : gvmc.gov.in → epayment → property tax/vacant land tax → Assessment Number (New / old) & email id → enter tax amount → pay now. ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు దారులు, గృహ యజమానులు ఆస్తి పన్నులను చెల్లించుకోవచ్చునని కమిషనర్ తెలిపారు.


Comments