విశాఖపట్నం నగరంలోని వెంకోజిపాలెంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 .*
మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ జనరల్ ఫిజీషియన్ మరియు కన్సల్టెంట్ డాక్టర్ మేఘనాథ్ యెన్ని మాట్లాడుతూ ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగిన నిద్రపోవడం వంటి అలవాట్లు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలను నివారించేందుకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం . అలాగే మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానంగా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం, యోగా వంటి పద్ధతులను పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, సానుకూల ఆలోచనలతో జీవించడం కూడా ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనను ఆచరణలో పెట్టాలని మనమందరం సంకల్పించాలి అని అన్నారు.

Comments
Post a Comment