అమలాపురం, విశాఖ సందేసం...రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకతతో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు మంగళవారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి అమరావతి నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి
22 ఏ భూములు, రి సర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ ముటేషన్లు రెవెన్యూ రిజిస్టరీ పిజిఆర్ఎస్ అంశాల పురోగతిపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు . ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ యుద్ధ ప్రాతిపదికన భూ రీ-సర్వే పనులు పూర్తి చేయడంతో పాటుగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను
ప్రతి నెల మొదటి వారంలో గ్రామ సభల ద్వారా పంపిణీ చేయాలన్నారు. భూ పరిపాలన మరియు రెవెన్యూ సేవల అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 22A జాబితాలో ఉన్న భూములపై వచ్చే అభ్యర్థనలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అర్హత ఉన్న భూములను జాబితా నుండి తొలగించే ప్రక్రియలో జాప్యం చేయకుండా, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలన్నారు. కోనసీమ జిల్లాలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటుగా సర్వే పూర్తయిన గ్రామాల్లో సవరించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు వెంటనే అందజేయాలన్నారు. భావితరాలకు వివాదరహిత భూముల హ క్కుపత్రాలను అందించాలన్నారు. ఏ ఒక్క రైతు కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదని, ప్రతి నెల మొదటి వారంలో గ్రామ సభల ద్వారానే పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాంకేతిక సమస్యలుంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.
రెవెన్యూ రికార్డులు స్వచ్ఛకరణ మరియు డిజిటల్ రెవెన్యూ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు.రెవెన్యూ వన్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అన్ని రెవెన్యూ సేవలు 'రెవెన్యూ క్లినిక్ల' ద్వారా ఒకే గొడుగు కిందకు రావాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని, సమస్యలు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రెవెన్యూ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. భూ సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీవో జి. మమ్మీ, తాసిల్దార్ చినబాబు , భూ పరిపాలన సూపరిండెంట్ సుబ్బరాజు, ఉప తహశీల్దార్లు వంశీ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment