విశాఖలో పరాకాష్టకు గీతం వర్శిటీ భూదోపిడీ భూబదలాయింపు ముందే అక్రమ నిర్మాణాలు వైఎస్సార్ సీపీ నేతల వెల్లడి గీతంలో పేదలకు 25 శాతం సీట్లు ఇవ్వాల్సిందే తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా నాయకులు విశాఖలో గీతం యూనివర్శిటీ భూదోపిడీ, అక్రమ నిర్మాణాలపై వైఎస్సార్సీపీ విద్యార్ధి, యువజన విభాగాలు చేపట్టిన నిరసనలో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధ్యక్షులు కేకే రాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు , రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ్, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త మొల్లి అప్పారావు , విశాఖపట్నం పశ్చిమం నియోజకవర్గం సమన్వయ కర్త మళ్ల విజయ ప్రసాద్.
విశాఖపట్నం:విశాఖలో మంత్రి నారా లోకేష్ తోడల్లుడి భూదోపిడీ:గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి
కూటమి ప్రభుత్వంలో విశాఖలో భూముల్ని తమకు లైసెన్స్ ఇచ్చారు అన్నట్లుగా గీతం యూనివర్శిటీ దోపిడీ చేస్తోంది. జీవీఎంసీలో కార్పోరేటర్లు, మీడియా గొంతునొక్కి అక్రమంగా తీర్మానం చేసుకున్నారు. ఏ లైసెన్స్, అనుమతి ఉందని ఆ భూముల్లో మీరు నిర్మాణాలు చేపడుతున్నారో చెప్పాలి. చంద్రబాబు కొడుక్కి తోడల్లుడు అనే ధీమాతోనే ఈ నిర్మాణాలు చేపడుతున్నారా ? 40 ఏళ్లలో 40-50 వేల మందిని ఉచితంగా చదివించినందుకు, విద్యాదానం చేసినందుకు ఈ అర్హత ఉందని భావిస్తున్నారా ? గీతం వర్సిటీ ఈ ప్రశ్నలపై సమాధానం చెప్పాలి. ఈ అక్రమాలపై చంద్రబాబు కళ్లు కనిపించడం లేదు. భూదోపిడీ ఓ పక్క, విద్య పేరుతో ప్రజల నుంచి దోపిడీ మరో పక్క జరుగుతున్నాయి. ఉంటే రాష్ట్రంలో మా యూనివర్శిటీయే ఉండాలి అన్నట్లుగా వీళ్ల వ్యవహారశైలి ఉంది. విశాఖలో ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్, ఆంధ్రా యూనివర్సిటీ ఉండొద్దు కానీ మీ ప్రైవేటు సంస్థలు మాత్రం దోపీడీ చేసుకుంటూ కొనసాగాలని కోరుకుంటున్నారు.
అమరావతి మద్దతుదారులు విశాఖ భూదోపిడీపైనా నోరు విప్పాలి
:కేకే రాజు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు విశాఖ ప్రాంతంలో బోగస్ పెట్టుబడులు పెట్టించి ఇక్కడి అభివృద్దికి అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారు. విశాఖ ఎంపీ భరత్ కు 5 వేల కోట్ల భూముల్ని కట్టబెట్టడంతో పాటు, ఆ భూమి బదలాయింపు కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కార్పోరేషన్ లో తీర్మానం కూడా చేశారు. జీవీఎంసీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాక, ఎలాంటి భూబదలాయింపు జరగకుండానే ఆక్రమిత అసైన్డ్, పోరంబోకు భూముల్లో పెద్జ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుల్ని కూడా తొలగించారు. నా తోడల్లుడి తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ఏదైనా చేస్తాం అన్నట్లుగా ఎంపీ బరితెగిస్తున్నారు. విద్యాసంస్థలకు ప్రభుత్వ భూములు బదలాయిస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 25 శాతం సీట్లు బదలాయించాలన్న నిబంధనను కూడా తుంగలోకి తొక్కుతున్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు చేపట్టిన నిరసనకు వైఎస్సార్సీపీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాం. అమరావతే అంతా అన్నట్లుగా మాట్లాడుతున్న కుహనా మేధావులు విశాఖకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పాలి. ఇక్కడి భూదోపిడీలు, కబ్జాలు మీ కళ్లకు కనిపించడం లేదా ? జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిపై ఈ మధ్య మావిగన్ ప్రతిపాదన చేస్తే కూటమికి అండగా ఉన్న మేథావులు అతిగా స్పందిస్తున్నారు. వీళ్లంతా గీతం దోపిడీపైనా స్పందించాలి.
ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి?:
మళ్ల విజయ ప్రసాద్, విశాఖపట్నం పశ్చిమం నియోజకవర్గం పార్టీ సమన్వయ కర్త
సంపద సృష్టిస్తామని వాగ్దానాలు చేసిన వాళ్లు అదే సంపదను హారతి కర్పూరంలా హరించేస్తున్నారు. గీతం వర్సిటీ దోపిడీ 30 ఏళ్లుగా కొనసాగుతోంది. ఫీజుల్లో కానీ, విద్యార్ధుల్లో కానీ, భూముల్లో కానీ ఎటు చూసినా దోపిడీయే. వీళ్లు ఎవరికీ ఉపయోగపడింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సర్వే చేయించి వీళ్ల కబ్జాను అడ్డుకునేందుకు చూస్తే, ఇవాళ అధికారం అండతో దాన్ని క్రమబద్ధీకరణ చేసుకుంటున్నారు. వీళ్ల కుట్రలు, కుతంత్రాలకు అంతు లేకుండా పోతోంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు తయారు చేయిస్తే దాన్ని వక్రీకరించి కుట్రలు చేశారు. మేం వస్తే న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు దోచుకుంటున్నారు. గీతం దోపిడీపై వెనక్కి తగ్గకపోతే భారీ ఎత్తున పోరాటాలు తప్పవు.
స్టీల్ ప్లాంట్ పోయినా ఫర్వాలేదు గీతం ఉంటే చాలు:
తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, గాజువాక నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త
కూటమి ప్రభుత్వం విశాఖలో భూముల్ని ఎకరం 99 పైసలకు అమ్మేస్తూ, కబ్జా చేసిన భూముల్లో దర్జాగా భవనాలు కట్టుకుంటోంది. విశాఖలో మేయర్ ను ఈ కార్యక్రమాల కోసమే మార్చారు. ప్రతీ స్టేడియాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి వాకర్ల దగ్గర కలెక్షన్లు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు నడుపుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని అస్సలు సహించరు. మీరు కబ్జా చేసిన భూముల్లో భవనాలు కట్టుకుంటున్నారు కానీ స్టీల్ ప్లాంట్ లో వేలాది కార్మికుల ఉద్యోగాలు పోతుంటే మొద్దునిద్రపోతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
గీతం భూదోపిడీని ఇప్పటికే అంగీకరించిన ఎంపీ భరత్:
మొల్లి అప్పారావు, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయ కర్త
55 ఎకరాల భూదోపిడీని క్రమబద్ధీకరించుకోవడానికి వైఎస్సార్సీపీ కార్పోరేటర్లను సంతలో పశువుల్లా కొన్నారు. గీతం కాలేజీల్లో పేదలకు ఫీజుల్లేకుండా విద్య అందిస్తున్నారా? అటువంటప్పుడు అప్పనంగా ఆ కాలేజీకి భూమి ఎందుకు కట్టబెడుతున్నారు ? స్వయంగా ఎంపీ గారే ఇది ఐదు వేల కోట్ల భూమి కాదు వెయ్యి కోట్ల భూమి అని స్వయంగా ఒప్పుకున్నారు. అంటే వెయ్యి కోట్ల భూమి అయితే అప్పనంగా కొట్టేస్తారా ? నగరంలో ఎందరో పేదల పొట్టకొట్టి వారికి ఎలాంటి ఉపాధి కల్పించకుండా అన్యాయం చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో గీతం వర్శిటీకి ఈ భూముల్ని ఎలా అప్పనంగా కట్టబెడతారు ? దీనికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తాం.
విశాఖ ప్రజల్ని దోచుకుంటున్న గీతం యూనివర్శిటీ:
ఉరుకూటి రామచంద్రరావు, పార్టీ విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు
గీతం అనే సంస్థ విశాఖ ఏర్పాటు చేసి, తమ రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ దశాబ్దాలుగా విద్యను అమ్ముకుంటున్నారు. విద్యార్ధుల తల్లితండ్రులు అప్పులు చేసి ఫీజులు కడుతుంటే, వారికి ఎప్పుడూ ఉచిత సీట్లు కేటాయించలేదు. విశాఖలో ఉంటూ స్థానిక ప్రజల ఆస్తుల్ని దోచుకోవడమే తప్ప వీళ్లు ప్రజలకు పనికొచ్చే పని ఎప్పుడూ చేయలేదు. అక్రమంగా అనుభవిస్తున్న 54.9 ఎకరాల భూమిని గీతం చెర నుంచి కాపాడేందుకు వైఎస్సార్సీపీ హయంలో ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని అనుభవిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆక్రమించుకుని నిర్మాణాలకు తెరదీశారు. కార్పోరేటర్లు పోరాటం చేసినా పట్టించుకోకుండా జీవీఎంసీలో అక్రమంగా తీర్మానం ఆమోదించుకున్నారు.
ఏయూను నిర్వీర్యం చేసి గీతం వర్శిటీ కోసం కబ్జాలు:
ద్రోణంరాజు శ్రీ వాత్సవ్, పార్టీ విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఎన్నో ఏళ్లుగా గీతం వర్సిటీ 54 ఎకరాలు తమ కబ్జాలో ఉంచుకుని, మాకు రాసివ్వండి, డబ్బులు కడతాం అంటున్నారంటే ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. విశాఖలో ఏయూను నిర్వీర్యం చేసి, అక్కడ కోర్సులు, రిక్రూట్ మెంట్లు ఆపేసి గీతం సంస్థను ప్రమోట్ చేసుకునే పనిలో ఎంపీ భరత్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్వేతసౌధం లాంటి ప్రభుత్వ భవనం కడితే ఆయన స్వార్ధం కోసమంటూ తప్పుడు రాతలు రాసుకున్నారు. టీడీపీ చేస్తున్న తప్పుల్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. గీతం కబ్జా చేసిన 54 ఎకరాలను తిరిగి ప్రభుత్వానికి ఇప్పిస్తాం. దీనిపై కోర్టుల్లో పోరాడతాం.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు గోలగాని హరి వెంకత కుమారి , కట్టమురి సతీష్ , జియ్యని శ్రీధర్, రొంగాలి జగ్గన్నాధం , సతీష వర్మ , పోతిన హనుమత్ , పెడాడ రమణి కుమారి , కొండా రాజీవ గాంధి , తాడి జగ్గన్నాద్ రెడ్డి , పళ్ళ దుర్గ, జివి రామ చంద్ర రాజు , లింగం శ్రీను , రామిని రెడ్డి , ఝాన్ వేస్లి, పేర్ల విజయ చంద్ర , ఎస్కే మహంతి , అల్లంపల్లి రాజు బాబు , పివి సురేష్ , ఆళ్ళ శంకర్ రావు , అనిల్ కుమార్ రాజు , పద్మా రెడ్డి , రాము నాయుడు , బిపిఎన్ కుమార్ జైన్ , వావిల్ల ప్రసాద్ , మహ్మద్ ఇమ్రాన్, కెవి శేశికల , అంబటి శైలష్, ముత్తం సునీల్ , సేనాపతి అప్పారావు , శ్రీదేవి వర్మ . శివ రామ కృష్ణ , మనోజు , కర్రి రామి రెడ్డి , బొండా ఉమామహేశ్వరరావు , పిలా ప్రేమ , రాయపు రెడ్డి అనిల్ కుమార్ , సనపల రవింద్ర భరత్, దేవరకుండా మార్క్దేయలు, మెరవ గణేష్ , బంగారు , పి సూరిబాబు, గోవింద్ , రామ రాజు , రామన్న పాత్రుడు, బయవరపు రాధా, ఈశ్వర్ రావు , దొడ్డి కిరణ్ , కనక ఈశ్వర్ రావు , సత్యాల సాగరిక , బాణాల తరుణ్ , కనక ఈశ్వర్ రావు , బెద్మల పద్మావతి , జీలకర్ర నాగేంద్ర , ఉమ్మడి కళ్యాణ్ , బాను , గీత రెడ్డి , జియ్యని వెంకట సత్య , గీత రెడ్డి , సాగర , వెంకట్ పార్వతి , రజిని , దివ్య కల , గంగా మహేష్ , సుశీల , కృష వేణి , జగ్గ పల్లి నరేషు , హరి కృష్ణ రెడ్డి , బంకు సత్య , చోలింగి నాగేశ్వరరావు, సర్వాసే రెడీ , హబిబు , సుకుమార్ , కిరణ్ , రమేష్ , దొడ్డి బాబు ఆనంద్ , దమయంతి , పితల వాసు , బి గోవింద్ , శ్రీనివాస్ రెడ్డి , సత్యాల వెంకట , రిసు అనురాధ, శిరాష, మువ్వల సంతోష్, తాడి రవి తేజ , రవి కిరణ్ రెడ్డి , రాఘవ్రాలు , లక్ష్మణ్ , చాణక్య , తులసి , ప్రదీప్, శ్రీనివాస్ రెడ్డి, సంపగి సురేష్ , రౌతు శ్రీను , దుళ్ళ రాము నాయుడు , వెంకట రావు , సంధ్య , తుళ్ళి చంద్ర శేఖర్ , బోని అప్పారావు , పోతిన హరి కృష్ణ , కృష్ణ వేణి, ఓమ్మి రత్నం , వసితి, సత్యవతి , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.







Comments
Post a Comment