సింహగిరిపై చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి అనిత* *పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి* *ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలి* *సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ* *ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా* *సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం*..*హోం మంత్రి అనిత*.
సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ నిర్వహించడంతో పాటు, ఆధునిక ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నారు.భక్తులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు విస్తృతంగా పంపిణీ చేయాలని సూచించారు. ఈ ఏర్పాట్లు పరిశీలనలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, సింహాచలం ఆలయ ఈవో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, చందనోత్సవం ఒక అపురూపమైన ఘట్టమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం వస్తారని చెప్పారు. గత సంవత్సరం సుమారు 1.20 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి దాదాపు 2 లక్షల మంది భక్తులు రానున్నారని అంచనా వేస్తున్నాం అని తెలిపారు. సామాన్య భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని,అంతరాలయ దర్శనం ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం 10 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పిస్తున్నాం అని మంత్రి వెల్లడించారు.



Comments
Post a Comment