Skip to main content

*శ్రీ సత్య సాయి విద్యా విహార్* సెక్టార్-8, ఎం.వి.పి కాలనీ, విశాఖపట్నం తేదీ: 16, April, 2026 *2026 ‘ఆల్ ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్’ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి 100% ఉత్తీర్ణత ఫలితాలతో ప్రతిభ చాటిన శ్రీ సత్య సాయి విద్యా విహార్ విద్యార్థులు*

 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, ఈ ఏడాది(2026) కూడా అఖిల భారత స్థాయి ఆల్  ఇండియా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్’ పదవ తరగతి పరీక్షా  ఫలితాల్లో  (2025–26 విద్యా సంవత్సరానికిగాను) శ్రీ సత్య సాయి విద్యా విహార్, విశాఖపట్నం విద్యార్థులు  అత్యుత్తమ ఫలితాలు సాధించి 100% విజయం సాధించిన విషయాన్నిమీకు  ఆనందంగా తెలియజేస్తున్నాం.

ఈ పరీక్షలకుశ్రీ సత్య సాయి విద్యా విహార్ నుండి  హాజరైన *మొత్తం200  మంది విద్యార్థులూ (నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో ) ఉత్తీర్ణులయ్యారు . ఇందులో   36 మంది  విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించగా , 125 మంది విద్యార్థులు  డిస్టింక్షన్ (అంటే 75%కి పైగా మార్కులు) సాధించగా, 194 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు*. 

పాఠశాల సగటు మార్కు శాతం 78.09 % గా నమోదు అయింది.

ఈ పరీక్షా ఫలితాల్లో 

🎖️ *కుమారి ఆర్ జాస్మిత   97.5%  మార్కులతో పాఠశాలలో  ప్రథమ స్థానం సాధించగా , కుమారి ఐ  నిషిత 96.5% మార్కులతో ద్వితీయ స్థానం సాధించగా, ముగ్గురు  విద్యార్థులు మాస్టర్ ఎం లలిత్ ఆదిత్య , మాస్టర్ డి హేమ చంద్ర రాజు మరియు కుమారి ఆర్ ఎన్ సాయి దిత్య  95.8 % మార్కులతో తృతీయ స్థానం  సాధించారు*.

ఇక సబ్జెక్టుల  వారీగా కూడా విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు.  *ఇద్దరు విద్యార్థులు కుమారి  ఆర్ యెన్  సాయి దిత్య ,    కుమారి అమోలి పాండే ఇంగ్లీష్‌లో, కుమారి ఐ నిశిత  తెలుగులో,  కుమారి  ఆర్ యెన్ సాయి దిత్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో  తలో 100%(నూటికి నూరు మార్కులు)  మార్కులు సాధించగా*,సోషల్ సైన్స్‌లో 3 ముగ్గురు  99% మార్కులు సాధించగా, సంస్కృతంలో ఇద్దరువిద్యార్థులు   మరియు సైన్స్‌లో ఇద్దరువిద్యార్థులు   98 %మార్కులు పొందారు. ఇది కాకుండా , 

, హిందీలో 1 విద్యార్థి 96% మార్కులు, గణితంలో 4 గురు  విద్యార్థులు 95% మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. 

ఈ అపూర్వ విజయం సాధించినందుకు , *శ్రీ సత్య సాయి విద్యా విహార్  కన్వీనర్ మరియు ప్రశాంతినిలయం  శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ అడ్మిన్ కోఆర్డినేటర్  శ్రీ ఎస్.జి. చలం, ప్రిన్సిపాల్ శ్రీమతి చేకూరి  వరలక్ష్మి* , మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని  హృదయపూర్వకంగా అభినందించి, విద్యార్థులందరికీ మెరుగైన ఉజ్వల  భవిష్యత్తు కలగాలని  ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియచేసారు.


శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు టాప్పర్(1st రాంక్ ) - కుమారి ఆర్ జాస్మిత 


శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు సెకండ్  టాప్పర్- కుమారి  ఐ  నిషిత 



శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు సంయుక్త థర్డ్ టాప్పర్లు -       మాస్టర్ ఎం లలిత్ ఆదిత్య , మాస్టర్ డి హేమ చంద్ర రాజు మరియు కుమారి ఆర్ ఎన్ సాయి దిత్య

                   K.V.SHARMA. EDITOR 



Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.