విశాఖపట్నం ఏప్రిల్ 7: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ క్రికెట్ జట్టు ఏపీఈపీడీసీఎల్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య పేర్కొన్నారు. మంగళవారం త్రీష్ణ మైదానంలో జీవీఎంసీ, ఏపీఈపీడీసీఎల్ జట్ల మధ్య వీడిసిఏ ఇన్స్టిట్యూషన్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
జీవీఎంసీ, ఏపీఈపీడీసీఎల్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలలో జీవీఎంసీ జట్టు 8 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించిందని, మొదటగా బ్యాటింగ్ చేసిన ఏపీఈపీడీసీఎల్ జట్టు 17.4 ఓవర్లలో 81 పరుగులు చేసి ఆల్ అవుట్ అయిందని, తదుపరి జీవీఎంసీ జట్టు 9.5 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 83 పరుగులతో విజయం సాధించిందన్నారు. జీవీఎంసీ తరఫున సునంద 29, శ్రీను 25 పరుగులు సాధించారని, రాజు 3 వికెట్లు, సుబ్రహ్మణ్యం 2 వికెట్లు, చక్రపాణి 2 వికెట్లు సాధించి జీవీఎంసీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు
ఈ సందర్భంగా విజయం సాధించిన జీవీఎంసీ క్రికెట్ జట్టు ను జీవీఎంసీ అదనపు కమిషనర్ తో పాటు ఇంచార్జి స్పోర్ట్స్ డైరెక్టర్ ఈ ఎ రాజు, టీమ్. మేనేజర్ సన్నీ అభినందించారు.
పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ.

Comments
Post a Comment