జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ మెయిన్ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ప్రభంజనం సృష్టించారు.ఈడబ్ల్యుఎస్ విభాగంలో భోగవిల్లి నిష్మిత్ 99.57 పర్సంటైల్ తో సత్తా చాటారు. ఆల్ ఇండియా ర్యాంకు 6881 ర్యాంకు, క్యాటగిరి ర్యాంకు 818 తో జయకేతనం ఎగురవేశారు.ఈ సందర్భంగా నిష్మిత్ మాట్లాడుతూ ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నానని తెలిపారు,మంచి ఐఐటీలో సీటు సంపాందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. కళాశాల ఫ్యాకల్టీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించగలిగానని తెలిపారు. భవిష్యత్లో మంచి కంప్యూటర్ ఇంజనీర్ కావాలని తెలిపారు. తన తండ్రి రాజేష్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నారని, అమ్మ శ్రీఅనిత జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు నిష్మిత్ తెలిపారు.

Comments
Post a Comment