Skip to main content

ఓట్ల కోసం పాచికలు, నేటి పాలకుల పని, పార్టీల నడుమ . పోటా పోటీ . పోరు".

 అటు కేంద్రం 

ఇటు రాష్ట్రలు 

పన్నుల వసూళ్లు 

మధ్య తరగతి 

పౌరుల నుంచి.

పధకాలు 

ఓట్లు కోసం.

పెన్షన్లు రాజకీయ 

నాయకులకు,

పన్ను రాయతీలు 

ఎగవేతలు 

సంపన్న వర్గాల 

కోసం. ఇదేమి 

పాలన?

పాలనను 

సంపూర్ణ 

ప్రక్షాళన 

చేయాలి.

ఏది సముచితం,

అనుచితం 

ఏది అనవసరం 

అన్న చర్చ 

జరగాలి.

మేధావులు,

సామాజిక 

కవుల సలహాలు 

స్వీకరించాలి.

ఎవరు అధికారం 

లో ఉన్న, ముఖ్యం 

గా కేంద్రం కనీసం

5 సం: కొక సారి 

Budget ముందు 

నిర్ణయాలు 

స్వీకరించాలి. 

పధకాలతో 

పాలన,

కేంద్ర మైనా,

రాష్ట్రాలైనా 

ఎవరూ 

తీసిపోరు.

ఇంకా ఎన్నాళ్ళు 

కొనసాగిస్తారు?

అధికారమే 

మీ పరమావధా!

ప్రజాధనoతో 

ఓట్లు కొనుక్కొని 

అధికారం చేపట్టి 

పాలన సాగించ

డమేనా! పార్టీల 

నడుమ నేడు 

5 రాష్ట్రలలో 

పోటాపోటీ గా 

పధకాల పందేరo.

సామాన్యుల 

నడ్డి విరచి 

పన్నులు వసూలు 

చేస్తూ, ప్రజనీకాన్ని 

సోమరి పోతులుగా 

తీర్చి దిద్దు తున్నారు.

గతం లో 

స్వాతంత్ర్య 

తరువాత 

పాలకులు 

ఎటువంటి 

పధకాలను 

ప్రవేశ పెట్టకుండా 

సుపరి పాలన 

అందచేయలేదా!

రేషన్ కార్డు ద్వారా 

రేషను అంద

చేస్తున్నారు,

EWS స్కీం క్రింద 

గూడు కల్పిస్తున్నారు,

వైద్య సదుపాయం 

ఎలాను ఉంది. ఇంకా ఎందుకు 

ఉచితాలు?

సామాన్యుడు 

పన్ను కట్టని 

వస్తువు కానరాదు,

నేడు. చివరకు పంచ 

భూతాలను 

పన్ను కట్టి 

కొనుగోలు 

చేసుకోవలసినదే.

నీరు, నిప్పు,

నింగి, నేల, గాలి 

పన్నుల నుంచి 

మినహాయింపు 

లేదు. కాలికి 

తొడుక్కునే 

పాద రక్షలనుంచి,

కంటికి ధరించే 

కళ్ళ జోడు 

వరకూ పన్ను 

కట్ట వలసినదే.

కొంటే పన్ను,

తింటే పన్ను,

పంటి పై పన్ను,

వంటి పై పన్ను,

వంట పై పన్ను,

వీక్షించే టీవీ పై పన్ను, సినిమా 

TICKET పై పన్ను,

వాహనం పై పన్ను,

రాసుకునే పెన్ పై

పన్ను, ధరించే 

వస్త్రాలపై పన్ను,

తోముకునే బ్రష్,

గీసుకునే నాలుక 

బద్ధ, వినియోగించే 

పేస్ట్ పై, ఇది పన్ను 

నుండి మినహాయించాం 

అన్న వస్తువు 

కానరాదు.

పన్ను కట్టేది 

సాన్యుడు,

పధ కాలు 

ఓటర్ల సమీకరణ 

కోసమా!

ఇదెక్కడి చోద్యం?

ఇదెక్కడి న్యాయం?

అందుకే గారికిపాటి 

వారు వాపోయారు,

చివరకు వారి 

మాటలనూ వక్రీకరించిన 

ఘనులమూ 

మనమే.

కేంద్ర ప్రభుత్వం 

వీటికి అడ్డు కట్ట 

వేయకపోగా 

వంత పాడటమేనా!

ఇదేనా సామాజిక 

న్యాయం? కాదు 

సామాజిక సామూహిక 

అన్యాయం 

అనవచ్చు.

ఓటరు అనేవాడు 

ఎవడైనా పధకా లను తిరస్కరించాలి,

ఉపాధి కోసం 

ప్రభుత్వాలను 

నిలదీయాలి,

ఉచితాలు 

సముచితాలు 

కాదని 

నినదించాలి 

అప్పుడే 

సామాజిక న్యాయం 

ఫరిడవిల్లుతుంది 

పాలకుల 

పాచికలు 

వీగిపోతాయి 

సామాజిక 

న్యాయం 

అంది 

దేశం 

అభివృద్ధి 

పదం వైపు 

పరిగిడుతుంది.


                   

                       


                         Dr. నండూరి రామక్రిష

                               03.04.2026

Comments