Skip to main content

బెల్లంపూడి గ్రామ సర్పంచ్ "బండి మహాలక్ష్మి "ని ఘనంగా సన్మానించిన గ్రామ యువత....

పి. గన్నవరం, విశాఖ సందేసం...బెల్లంపూడి గ్రామ సర్పంచ్ గా " బండి మహాలక్ష్మి " అయిదేళ్ల పాటు పాలన  చేసి,గ్రామాన్ని అభివృద్ధి చేసి,ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అత్యున్నత సేవలు అందించి, పదవీ విరమణ చేసిన సందర్భంగా, ఆమె  చేసిన  సేవలను ప్రశంసిస్తూ ,కృతజ్ఞతలు మరియు అభినందనలు  తెలుపుతూ బెల్లంపూడి  గ్రామ యువత  ఆధ్వర్యంలో  సర్పంచ్  "బండి మహాలక్ష్మి" ని శుక్రవారం  ఘనంగా సన్మానించారు. అయిదేళ్ల పాటు సర్పంచ్ గా సేవలందించి  గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం,  ప్రతి ఇంటికి ఉదయం ,సాయంత్రం స్వచ్ఛమైన  త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు సక్రమంగా నిర్వహణ , అత్యుత్తమ పారిశుద్ధ్య 

నిర్వహణ,గ్రామంలో కొన్ని కోట్ల రూపాయలతో  మౌళిక సదుపాయాల ఏర్పాటు చేసి,గ్రామాన్ని అగ్రస్థానంలో నిలబెట్టార ని,పాలకవర్గం సభ్యులు మరియు అధికారుల సహకారంతో బెల్లంపూడి  గ్రామానికి  రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకుని  వచ్చారని,ఆనందం  వ్యక్తం చేస్తూ , సర్పంచ్  "బండి మహాలక్ష్మి" ని  మరియు అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన ఆమె కుమారుడు బండి రమేష్ను కూడా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అడబాల శ్రీను,అడబాల దుర్గారావు, బండి రామ నాగబాబు ( పండు) , పేరాబత్తుల మణికంఠ,పేరాబత్తుల దుర్గా ప్రసాద్, తిక్కా పండు, తిక్కా సతీష్, అడబాల వీర పండు ,బండి సతీశ్,వర్ధినీడి శ్రీ మణికంఠ  పాల్గొన్నారు.

Comments