Skip to main content

ప్రత్యేక అధికారిగా ఏడుకొండలు బాధ్యతలు స్వీకరణ.....

 


అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం రెల్లుగడ్డ,తూర్పులంక గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా మండల విద్యాశాఖ అధికారి -2 సానబోయిన ఏడుకొండలు  బాధ్యతలను  స్వీకరించారు.  రెల్లుగడ్డ,తూర్పులంక గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేక అధికారి  ఏడుకొండలు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాలలో త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటానని ,  గ్రామాలలో పారిశుధ్య పనులను సమయానికి చేసేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏడుకొండలకు  పంచాయతీ కార్యదర్శి సాయి కళ్యాణ్ , గ్రామ రెవెన్యూ అధికారి ఎన్ వెంకటేశ్వర రావు,ఉపాధ్యాయులు బత్తుల నకుల రాజు , ముత్యాల నరసింహరావు, మహిపాల శ్రీనివాసరావు, సిఆర్ఎంటి శెట్టి  ,స్వర్ణ గ్రామ సిబ్బంది ఈశ్వర్, రమేష్, సంతోషి, సురేష్ , పంచాయతీ సిబ్బంది గంటా నాగేశ్వర రావు,శ్రీ రాములు, అంగన్వాడీ కార్యకర్త  కాశీ అనంత లక్ష్మిలు  శుభాకాంక్షలు తెలియజేసి ఆయనను దుస్సాలువతో సత్కరించారు.

Comments