అల్లవరం, విశాఖ సందేసం...భారతరత్న భీమ్ రావు రాంజీ అంబేద్కర్ అంటే సామాజిక విప్లవమని ఆయనను ఆదర్శంగా తీసుకుని నాలాంటి ఎందరో ఐపీఎస్, ఐఏఎస్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకున్నామని ఏఐజి, మోకా సత్తిబాబు ఐపీఎస్ అన్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శెట్టిబత్తుల సుభాష్ ఆధ్వర్యంలో ఆదివారం జన చైతన్య మహాసభకు సత్తిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం కోనసీమ జిల్లా పునీతమైందని అన్నారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడిచిన బి.వి రమణయ్య, అన్న పివి రావు, బొత్స తారకం, కవి బోయి భీమన్న వంటి ఎందరో మహానుభావులు జన్మించిన కోనసీమకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టడం యావత్ భారతదేశం ఎంతో చైతన్యం కలిగిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు చూస్తుందన్నారు. అంబేద్కర్ అంటే అక్షరమని విద్యతోనే జ్ఞానాన్ని సంపాదించవచ్చునని అంబేద్కర్ భావించారన్నారు. పుస్తకాలు దాచుకోవడానికి ఇల్లు నిర్మించుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క అంబేద్కర్ అని ముంబైలోని ఆయన ఇంటిని (రాజ గృహా) లైబ్రరీగా చేసి అందులో 50వేల పుస్తకాలను దాచుకున్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ అన్నారు. యువత మద్యం వంటి దుర వ్యసనాలకు బానిసలు కాకుండా విద్యావంతులై చైతన్యం కలిగి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు మాట్లాడుతూ అంబేద్కర్ ముందుచూపు,ఆలోచన, విజ్ఞానాన్ని కొనియాడారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉదయం అల్లవరం హై స్కూల్ సెంటర్ నుండి జన చైతన్య మహాసభ ర్యాలీగా కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంకు చేరుకుంది. సభ అనంతరం అంబేద్కర్ యాక్షన్ ఫోర్స్ ఏ.ఏ.ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. జన చైతన్య యాత్ర సందర్భంగా పాఠశాలలలో అంబేద్కర్ పై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమొంటోలు,క్యాష్ ప్రైజ్ ను సత్తిబాబు ఐపీఎస్ చేతుల మీదుగా అందజేశారు. 
సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు అంబేద్కర్ చిత్రపటాలు, మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ల శేషారావు, గునిశెట్టి చినబాబు, పరమట నరసింహమూర్తి, చింతా రామకృష్ణ, నాతి శ్రీనివాస్, పుల్లూరి సత్యనారాయణ స్వామి, వడ్డీ వెంకటేశ్వరరావు, రాయుడు విష్ణు, వుల్లూరి గంగాధర్, జిత్తుక సత్యనారాయణ,ఉపాధ్యాయులు బత్తుల నకుల రాజు,అంబటి కోటేశ్వరరావు, జనిపెల్ల లోవరాజు,శెట్టి బత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Srinivas Spl Correspondant


Comments
Post a Comment