Skip to main content

భూముల రిసర్వేతో మాజీ సైనికుల వారసుల తలరాతలు మారేనా...? కొమరగిరిపట్నంలో రిసర్వేపై గ్రామసభ.....

             Srinivas Spl Correspondant 


 అల్లవరం. విశాఖ సందేసం....ప్రభుత్వాలు ఎన్ని మారిన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులుగా వ్యవహరించిన కుటుంబాల వారసులు తలరాతలు కూటమి ప్రభుత్వంలో   రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రిసర్వే ద్వారానైన మారతాయో లేదో వేచి చూడాలి..అల్లవరం మండలంలోని ఐదు మేజర్ పంచాయతీలలో కొమరగిరిపట్నం గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద భూముల రిసర్వేకు సంబందించి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గురువారం గ్రామసభను నిర్వహించారు. ముఖ్యతిధిగా మండల తహసీల్దార్ వి.ఎల్  నరసింహారావు పాల్గొన్నారు. గ్రామంలో ముఖ్యంగా మాజీసైనికుల అగ్రికల్చర్ ల్యాండ్ కోలైనైజెషన్ కో ఆపరేటివ్ సొసైటి ఫర్ ఎస్ సర్వీస్ మెన్ సంఘానికి చెందిన మాజీసైనికుల వారసులు భూములు సుమారు 470 ఎకరాలు భూమి అప్పటి  రాయల్  బ్రిటిష్ ప్రభుత్వం మంజూరు చేయగా అప్పటి నుండి ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు మారాడంతో  అ భూములు 22(ఎ ) నిషిద్ద ఆస్తుల జాబితాలోనే ఉన్నాయి. మాజీ సైనికుల వారసులు  2016 నుండి రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు మాత్రం మీ భూములకు సంబంచిన ప్రొసీడింగ్స్ పత్రాలు తీసుకురావాలని చెప్పేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం  జి.ఒ నెం. 435/2026 విడుదల చేసింది. ఈ జిఓ ప్రకారం అలనాటి ప్రొసీడింగ్స్ పత్రాలు లేకపోయినా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి దగ్గర ఉన్నా పలు ఆధారాల ప్రతాలు డి. పట్టా, ఆడంగల్, 1బి, ఎ రిజిస్టర్ నమోదు అయ్యిఉన్న  జాబితా,లలో ఉన్నా ఆధారాలు ఉంటే వారి భూములను తప్పనిసరిగా  నిషిద్ద ఆస్తులు జాబితా  22 (ఎ ) నుండి అ భూములను తొలగించవలసినదిగా ఈ జిఓ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 


మాజీసైనికుల అగ్రికల్చర్ ల్యాండ్ కోలైనైజెషన్ కో ఆపరేటివ్ సొసైటి ఫర్ ఎస్ సర్వీస్ మెన్ సంఘం అధ్యక్షులు అంబటి కృష్ణ గంగాధరరావు, డైరెక్టర్ తాడి సత్యనారాయణ (బుజ్జి), మాజీ సైనికుల వారసులు పరమట కాళిదాసు బాబు, బొడ్డపల్లి సురేష్, గెద్దా జూన్సన్ లు రిసర్వే గ్రామసభలో తమ భూముల సంబందించి జిఓ ప్రకారం ఎందుకు తొలగించలేదని తహసీల్దార్ ను ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో జిఓని ఇంప్లిమెంట్ చేయమని మాకు ఇంకా జిల్లా కలెక్టర్ నుండి ఉత్తర్వులు రాలేదని తెలిపారు. ప్రస్తుతం రిసర్వే జరుగుతుందని, జిల్లా కలెక్టర్ నుండి ఉత్తర్వులు అందిన వెంటనే  అ భూములను తొలగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి చిక్కాల శ్రీనివవాస్, మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్లు, విష్షు  తదితరులు  పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.