పారిశుధ్య నిర్వహణలో లోపాలను సవరించి మెరుగుపరచండి. * పారిశుధ్య నిర్వహణ లోపాలు ఉంటే చర్యలు తప్పవు. * తాగునీటి సరఫరా లో నిత్యం నాణ్యతా పరీక్షలు చేపట్టి జాగ్రత్తలు పాటించండి. * రోడ్లపై , వీధులలో భవన నిర్మాణ వ్యర్ధాలు , ఫుట్ పాతులపై ఆక్రమణలు, అస్తవ్యస్తంగా పోస్టర్లు లేకుండా తగిన చర్యలు చేపట్టండి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
విశాఖపట్నం, ఏప్రిల్ 18: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయని వాటిని వెంటనే సవరించాలని లోపాలు ఉంటే చర్యలు తప్పవని, తాగునీటి సరఫరాలలో నిత్యం నాణ్యతా పరీక్షలు చేపట్టాలని, రోడ్లపై, వీధులలో భవన నిర్మాణ వ్యర్ధాలు, ఫుట్ పాత్ లపై ఆక్రమణలు లేకుండా తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని
, ప్రతి భవన నిర్మాణం వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకొని నిర్మాణాలు చేపట్టేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శనివారం ఆయన నార్త్ జోన్ , 25 వ వార్డు లో బీవీకే కాలేజ్ జంక్షన్ నుండి సీతంపేట జంక్షన్ మీదుగా మధురానగర్ పరిసర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ బి.రాము, సహాయక వైద్యాధికారి డాక్టర్ అప్పలనాయుడు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ తిరుపతిరావు లతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ 25 వ వార్డులో పర్యటిస్తూ మధురా నగర్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల నివాసితుల ఇండ్ల ముందు, వాణిజ్య సముదాయాల ముందు , సాయిబాబా దేవాలయం వద్ద అధికంగా వ్యర్ధాలు ఉన్నందున, నిత్య పారిశుధ్య నిర్వహణపై సంబంధిత శానిటరీ సూపర్వైజర్ ను, వార్డు శానిటేషన్ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణలో వారి విధి విధానాలు,
పిన్ టు పిన్ కార్యాచరణ, నిత్యం వ్యర్ధాలు సేకరించి తరలించే ప్రక్రియ, వాహనాల పనితీరు, విధుల నిర్వహణలో అలసత్వం కనిపిస్తుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సమీపంలో స్థానికులు ఇంటింటి నుండి నిత్యం వ్యర్థాల సేకరణ , తరలింపు ప్రక్రియ జరుగుటలేదని కమిషనర్ కు తెలియపరచగా. , శానిటరీ సూపర్వైజర్ రామారావు, వార్డు శానిటేషన్ కార్యదర్శి సతీష్ కుమార్ లను వారి నిత్య కార్యాచరణలో వివరాల పై ఆరా తీసి వారి విధుల నిర్వహణలో లోపాలు, అలసత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయని వారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం చేసి తనకు నివేదించాలని జోనల్ కమిషనర్ రాముకు కమిషనర్ ఆదేశించారు.
వార్డులో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా లోపించిందని, వెంటనే సవరించి సరిచేయాలని , నిత్యం వార్డులలో ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సహాయక వైద్యాధికారి డాక్టర్ అప్పలనాయుడుకు కమిషనర్ ఆదేశించారు. జోన్ లో అన్ని వార్డులలో, సచివాలయాల పరిధిలో నిత్యం ఇంటింటి నుండి వ్యర్ధాల సేకరణ ,తరలింపు ,
వాహనాల పనితీరు, సానిటరీ సూపర్వైజర్లు ,సానిటరీ ఇన్స్పెక్టర్లు ,వార్డు శానిటేషన్ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల విధుల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ ను మెరుగుపరిచేలా నిత్య పర్యవేక్షణ జరపాలని జోనల్ కమిషనర్ కు కమిషనర్ ఆదేశించారు.
రోడ్లపై ,వీధులలో అధికంగా భవన నిర్మాణ వ్యర్ధాలు కనిపిస్తున్నాయని, ప్రతి భవనం నిర్మాణంలో గ్రీన్ మేట్ ఏర్పాటు చేసుకోవాలని , అలా ఏర్పాటు చేసుకోలేని వారి భవన యజమానుదారులకు 25 వేల రూపాయలు జరిమానా విధించాలని లేదా
భవన నిర్మాణ పనులను నిలిపివేసే ప్రక్రియ చేపట్టాలని , ఫుట్పాతులపై ఆక్రమణలు ఎక్కువగా కనిపిస్తున్నందున వాటిని వెంటనే తొలగింపుకు, పలుచోట్ల అస్తవ్యస్తంగా పోస్టర్లు అధికంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించే ప్రక్రియలు చేపట్టాలని అసిస్టెంట్ సిటీ ప్లానర్ తిరుపతిరావుకు కమిషనర్ ఆదేశించారు.
నగరంలో ప్రజలకు నిత్యం సరఫరా చేసే తాగునీటిలో నిర్ణీత సమయం పాటించాలని, సరఫరాలో లోపాలు లేకుండా నీటి నాణ్యతా పరీక్షలను నిత్యం జరిపి ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని , కాలువలలో నీటి పైపులైన్లు కలుషితం కాకుండా నిత్య పర్యవేక్షణ జరపాలని నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు శ్రీనివాసు ,భరణి, టిపిఓ ప్రవీణ్, సానిటరీ సూపర్వైజర్ రామారావు, వార్డు శానిటేషన్, ప్లానింగ్, ఎమినిటీస్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి ,జీవీఎంసీ
K.V.SHARMA. EDITOR
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
Comments
Post a Comment