. Srinivas Spl Correspondant
అల్లవరం, విశాఖ సందేసం...భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అల్లవరం మండలం మొగళ్లమూరు, సిరిగట్లపల్లి గ్రామాలలోని అంబేద్కర్ విగ్రహాలకు మంగళవారం అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ, ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలనిఅన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల అన్ని వర్గాల వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయ ఫలాలు అందుతున్నాయని, అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎంపీపీ శేషగిరిరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం నందు, అల్లవరం సామజిక ఆరోగ్య కేంద్రంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ రాకేష్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 135 వ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా అల్లవరం సబ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ హాజరై డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిత్తుక సత్యనారాయణ,జల్లి దొరబాబు హాస్పటల్ కు అంబెడ్కర్ చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో కాశీ చిరంజీవి, మద్దా వినోద్ రావు, చింతాభాస్కరరావు , కోరుకొండ చిట్టిబాబు,గూటం సత్యనారాయణ ,రొక్కల చిన్ని,రాయడు విష్ణు ,చింతా గణేష్ ,చింతా ప్రసాద్, గోగు కామేష్ ,కటారి రతన్ రాజు,సాపే సారధి, పోలమూరు వినోద్ హాస్పిటల్ స్టాఫ్,పలువురు పాల్గున్నారు.

Comments
Post a Comment