విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయిలు శ్రీ డి. దక్షిణ మూర్తి గారు , ఆచార్య ప్రగడ రాజ గణపతి గారు గాయత్రి సభ్యులు పాల్గొన్నారు. వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ దక్షిణామూర్తి గారు ర్యాలీ ని ప్రారంభించగా, ఆచార్య ప్రగడరాజా గణపతి గారు మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ వంద సంవత్సరాల సంబరాలు ఎంతో గర్వకారణం అని , ఈ సందర్భంగా చేస్తున్న ఈ ర్యాలీలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆచార్య సోమరాజు గారు గాయత్రి విద్యా పరిషత్ సెక్రెటరీ,
కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.ఎస్. బోస్ గారు, డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్ గారు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అన్ని విభాగాల అధిపతులు (HODs) , జన సంబంధాల అధికారి శ్రీమతి శేష పద్మ గారు మరియు అధ్యాపకులు కూడా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
విద్యార్థులు ఆంధ్ర విశ్వవిద్యాలయ గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. గాయత్రి విద్యా పరిషత్ కళాశాల, ఎంవీపీ సెక్టార్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎంవీపీ సర్కిల్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమం సమగ్ర సమన్వయంతో విజయవంతంగా ముగిసింది.



Comments
Post a Comment