Skip to main content

కిమ్స్ లో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు...

               Srinivas Spl Correspondant 


అమలాపురం, విశాఖ సందేసం....డా. బి.ఆర్. అంబేద్కర్  135వ  జయంతి వేడుకలను  కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం  ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్  రవి కిరణ్ వర్మ  మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్తగా డా. అంబేద్కర్ దేశానికి చేసిన సేవను గుర్తుచేశారు.అంబేద్కర్  రచించిన రాజ్యాంగం వల్లే భారతదేశం వైవిధ్యంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తమ తమ విధులను సక్రమంగా నిర్వహించిన నాడు మన దేశ పురోగతిలో భాగస్వాములం కాగలమన్నారు.ఈ సందర్భంగా కిమ్స్ వైస్ ప్రెసిడెంట్  మోహన రాజు  మాట్లాడుతూ.


 అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాముఖ్యతలను బలంగా ప్రతిపాదించిన మహనీయుడని అన్నారు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ డీన్ డా.ఆనంద్ ఆచార్య,  మెడికల్ డైరెక్టర్ డా.హరి కిరణ్ వర్మ , సి.ఏ.ఓ.  రఘు, మానవ వనరుల జి.ఎం.  రాధా మనోహర్ , విజిలెన్సు మరియు సెక్యూరిటీ జి.ఎం.కిరణ్ ,  కిమ్స్ వైద్యులు, వైద్య విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొని డా. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.