Skip to main content

సామాజిక సేవలతోనే సమాజాభివృద్ధి* *రాష్ర్టప్రభుత్వ అవార్డు గ్రహీతలకు సత్కారం* *డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ*

  ఎన్ఏడిజంక్షన్ఏప్రిల్ 3 :సామాజిక సేవలతోనే సమాజాభివృద్ధి మరింత సాధ్యమని డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి అన్నారు. శుక్రవారం ఎన్ఏడి జంక్షన్, కాకానినగర్ కేటీబీ కళాక్షేత్రంలో రాష్ర్ట ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు సాసుపల్లి రాజకుమారి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్లశ్రీనుబాబును అసోసియేషన్ సభ్యులంతా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో అనేక మందికి అవసరమైన రక్తం అందిస్తూ రాజకుమారి నిరంతరంగా సేవలందిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందని తద్వారా వేలాది మందికి ఆ రక్తంతో ప్రాణాలు నిలబెట్టేందుకు అవకాశం కలిగిందన్నారు. అలాగే 2016,2018,2026లో రాష్ర్ట ప్రభుత్వం ఉగాది పురస్కారాలు స్వీకరించిన గంట్ల శ్రీనుబాబు జర్నలిజం, ఆధ్యాత్మికతతో పాటు అనేక రంగాల్లో తనవంతు సామాజిక సేవ అందిస్తున్నారని కొనియాడారు. ప్రధానంగా కోవిడ్ సమయంలో గంట్ల శ్రీనుబాబు అందించిన సేవలు నిరుపమానమన్నారు. నిరంతరం ఎన్ జివో కో ఆపరేటివ్ సొసైటి ప్రతినిదులు ఆంజనేయులు, నూకల రామచంద్రరావులు మాట్లాడుతూ నిరంతరం  పది మందికి సహాయం చేయాలనే మంచి సంకల్పం కలిగిన ఇద్దరు పురస్కార గ్రహీతలను  ఒకే వేధికపై సత్కరించుకోవడం తమకు ఎంతగానో సంతోషం కలిగిస్తుందన్నారు. సన్మాన గ్రహీతలు రాజకుమారి, గంట్లశ్రీనుబాబులు మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించి పురస్కారాలుతో ప్రోత్సాహం అందించిన రాష్ర్టప్రభుత్వంతో పాటు తమను ఆదరించి సత్కరించిన పలు సంస్థలకు వీరు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు పురస్కారాలు మరింత బాధ్యతలు పెంచాయని భవిష్యత్తులో తమ పరిధి మేరకు మరింతగా సేవలందిస్తామన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ కు చెందిన ప్రతినిధులు, అధికారులు , సన్నిహితులు పాల్గొన్నారు.

Comments