ఏమి
సాధిద్దామని
ఎవరి కోసం
ఈ అనాలోచిత
నిర్ణయాలు.
మరీ అవసరం
అనుకుంటే
మీరు చావండి
కానీ అభం శుభం
తెలియని
చిన్నారులను
చంపే హక్కు
మీకు లేదు.
అక్రమ సంబంధాలు,
అనాలోచిత
ఆవేశ కావేశాల
నిర్ణయాలు.
దారుణాతి
దారుణం.
చావే పరిష్కారమా!
జీవితం జీవించ
డానికి, చంపే
హక్కు, చచ్చే
హక్కు ఎవరికీ
లేదు. ఆత్మ హత్య
మహా పాతకం.
మనిషి
సహనం కోల్పోతూ
అసహనానికి
గురి అవుతూ
చావుకి దారులు
షుగమం చేసుకుంటున్నాడు.
ఇది అత్యంత
హే్యమైన చర్య.
నిబద్దత లేదు.
సుఖ మయంగా
జీవించాలన్న
ఆశయం లేదు,
అనాలోచిత
ఆలోచనలు,
అక్రమ సంబంధంలు
నేడు సర్వ సామాన్యం.
విపరీత ధోరణలు,
వింత పరి
ణామాలు
ఎటు చూసిన
కనవస్తున్నాయి.
భయం లేదు
ఇరుగు పొరుగు
ఏమనుకుంటారు
అన్నది అసలే
లేదు. ఎటు
పోతున్నాం
మనం.
విచక్షణ
క్రమశిక్షణ
నిగ్రహం
సమయ
స్ఫూర్తి
ఎవరిలో
నేడు కాన
రాదు.
స్వలాభం
స్వప్రయోజనం
వైపే మనిషి
పైనం.
సమాజ హితం
ఎవరిలో
కాన రాదు.
మనిషి
కలుషితం
తీసుకునే
చర్యలు
అమానుషం,
అవివేకం తో
కూడుకున్నవి.
మనిషిలో
మార్పు
రావాలి,
ఆలోచన
సరళి మారాలి.
స్వార్ధం వీడాలి.
మానవ మాత్రులందరం
ఒకటే అని
చాటాలి.
అప్పుడే
మానవ
మనుగడ
మనగలుగుతుంది.
Dr. నండూరి రామక్రిష్ణ
03.04.2026

Comments
Post a Comment