Skip to main content

అహం" కారం'.

 అహం' 

భావ వ్యక్తీ 

కరణ.

అహం 

భావం 

అన్నారు.

స్వభావం.

'అహం' ను 

కారం తో 

పోల్చి 

'అహం' కారం 

అన్నారు.

అహం 

పతన కారకం.

పతనానికి 

చిహ్నం,

నాంది,

సంకేతం.

అహం తో 

మనగలగాలి 

అనుకోవడం 

అవివేకం,

ఆరంభ  శురత్వం.

అహం ఒక 

అవలక్షణం,

మనిషికి 

మాత్రమే సొంతం.

'ట్రంప్' ని 

అహంకారి 

గా భావించ వచ్చు,

అగ్ర దేశానికి 

అధిపతి గా.

అహకారం 

ఉండవచ్చు,

దాన్ని సమయాను 

కూలంగా 

అణచు కోవాలి,

అదే రాజకీయ 

చతురత,

పరిజ్ఞానం,

పరిపక్వత,

విచక్షణ,

వివేకి లక్షణం.

చదువు కాదు,

సమయస్ఫూర్తి,

సదంర్బోచిత 

నిర్ణయాల 

పరిశీలన.

ధనం తో 

దర్పం, అహం 

సంభవిస్తాయి,

కొందరిలో.

అధికారం కూడా 

అహంకారానికి 

మూలం.

అధికారం తో 

అహంకారం 

సహజం 

వాడు అహంకారిరా 

అంటాం.

కొందరికి 

అహంకారం తో 

కన్ను, మిన్ను 

కానదు,

మనిషి 

నిలువెల్లా 

అహంకారమే.

చాలా మంది 

IAS, IPS 

అధికారులలో 

అహం 

కానవస్తుంది.

ఇక కొంత మంది 

రాజకీయ 

నాయకులలో 

పదవి వచ్చిన 

పిదప అహంకారం 

వేరే చెప్పనక్కర్లేదు.

పోలీసులలోక్రింద 

స్థాయి నుంచి 

ప్రదర్శిస్తారు,

దర్పాన్ని.

మహిళా అధికా

రులలో అహం 

అంత కానరాదు.

కొంత మంది 

విగుణులు  అహం 

కారాన్ని అణగ 

దొక్కు కుంటారు,

వీరితో ప్రమాదం 

పొంచి ఉంటుంది,

ఎప్పటికైనా.

అహకారం 

అనర్ధాలకు 

మాత్రమే కాదు 

యుద్ధాలకు 

మూలం.

మనిషి నోరుని,

ఆహాన్ని అదుపులో 

ఉంచుకోవాలి,

లేనిచో తీవ్ర 

పరిణామాలను 

చవి చూడవలసి 

వస్తుంది అన్నది 

వాస్తవం. చరిత్ర 

తిరగ వేస్తే 

తెలుస్తుంది,

అవగత మవుతుంది 

'అహం' ఎంత 

ప్రమాదకారో.                     

 


                         Dr. నండూరి రామక్రిష్ణ


Comments