కార్యక్రమం ప్రార్థన గీతంతో ప్రారంభమైంది. అనంతరం ముఖ్య అతిథి ఆచార్య కె. మలయవాసిని గారు, గాయత్రీ కళాశాల యాజమాన్య ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ముఖ్య అతిథి ఆచార్య కె. మలయవాసిని గారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, మన మూలాలను మర్చిపోకుండా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు.
ఆచార్య విఠల్ మూర్తి గారు భారతీయులు కళలకు పెద్దపీట వేస్తారని, కళా కౌముది ద్వారా ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి రావాలని ఆశీర్వదించారు.
ఆచార్య రాజ గణపతి గారు గాయత్రి విద్యా పరిషత్ సభ్యులు మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన విద్య మరియు కళల పట్ల అవగాహన విద్యార్థి జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయని పేర్కొన్నారు.
శ్రీ దక్షిణ మూర్తి గారు , వైస్ ప్రెసిడెంట్ గాయత్రీ విద్యా పరిషత్ ఎల్లప్పుడూ విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, ఇటువంటి సాంస్కృతిక వేదికలు విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడతాయని తెలిపారు.
శ్రీ డి. గిరిధర్ గారు, డైరెక్టర్ – యూజీ కోర్సులు, కళా కౌముది క్లబ్ గడిచిన ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ, విద్యార్థులందరూ ఇలాంటి వేదికలను వినియోగించుకోవాలని సూచించారు.ప్రొఫెసర్ కె.ఎస్. బోస్ గారు, ప్రిన్సిపాల్, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
శ్రీమతి కాంచన గారు కార్యక్రమాన్ని సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ కార్యక్రమ వ్యాఖ్యానం చేశారు.అతిథి పరిచయాన్ని శ్రీమతి బాల గాయత్రి గారు నిర్వహించారు.వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, జానపద గీతాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
ఈ కార్యక్రమంలో కళాకారులకు సంబంధించిన ఒక వెబ్‌సైట్ మరియు ఒక పుస్తకాన్ని అతిథుల చేతుల మీదగా ఆవిష్కరించారు.
వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో బీకాం విభాగాధ్యక్షులు సూర్య లక్ష్మీ గారు, డాక్టర్ శ్యామల గారు, డాక్టర్ అనిత గారు, శ్రీమతి హరిత గారు, శ్రీ శంకర్రావు గారు, ఓ. ప్రకాష్ గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


Comments
Post a Comment