Skip to main content

ముడసర్లోవలో పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ . * భవనం అభివృద్ధి దిశగా ఆదాయ మార్గాలను అన్వేషించండి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.


 విశాఖపట్నం ,ఏప్రిల్ 22: విశాఖ నగరం లోగల ముడసర్లోవ సమీపంలో గల పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని అభివృద్ధిపరిచి జీవీఎంసీ కి ఆదాయ మార్గాలను అన్వేషించాలని అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మకు, ప్రధాన ఇంజనీర్ పీవీ సత్యనారాయణ రాజు , ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ శివప్రసాదు లకు కమిషనర్ ఆదేశించారు. బుధవారం ఆయనముడసర్లోవ సమీపంలో గల పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని , పరిసరాలను క్షుణంగా పరిశీలించారు


ఈ పరిశీలనలో కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ కి అతిపెద్ద ఆస్తిగా పాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రదేశం ఉందని, ఆ భవనాన్ని అభివృద్ధి పరిచి జీవీఎంసీ కి ఆదాయ మార్గంగా చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతమంతా కలియతిరిగి భవనం యొక్క పూర్తి వివరాలను , విస్తీర్ణం, భవనాల కొలతలు, ఇదివరకు నెలకు అద్దె రూపంలో ఎంత ఆదాయం జీవీఎంసీ కి సమకూరిందని జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్ ను అడిగి తెలుసుకుని , భవనంలో,భవనం చుట్టూ వ్యర్ధాలు, తుప్పలు పేరుకుపోయి ఉన్నందున వెంటనే వాటిని తొలగించే కార్యక్రమం చేపట్టాలన్నారు.


ఆ భవనాలలో నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ ,సివరేజ్, శానిటేషన్, టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాల పై కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. 33 వేల చదరపు అడుగులు గల భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా జీవీఎంసీ కి ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఆ దిశగా పరిశ్రమలకు గాని, ఐటీ, కార్పొరేట్ సంస్థలకు గాని అద్దెకు ఇచ్చేదా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కొరకు ఆసక్తిదారులను ఆహ్వానించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ వర్మకు, ప్రధాన ఇంజనీర్ కు, జోనల్ కమిషనర్ కే శివప్రసాద్ కు కమిషనర్ ఆదేశించారు. అలాగే ఆ ప్రాంగణంలో ఏ ఏ కార్యాలయాలు నిర్వహిస్తే జీవీఎంసీకి లాభదాయకంగా ఉంటుందని తగు సూచనలను అందించవలసిందిగా వారికి కమిషనర్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీర్ శాంతిరాజ్, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్, రెవెన్యూ అధికారి ఏ అప్పలరాజు, వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి ,జీవీఎంసీ

                   K.V.SHARMA EDITOR


Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.