అల్లవరం, విశాఖ సందేసం....డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చింతా వీరప్రసాద్ మాట్లాడుతూ.. మే 6, 7 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను కూలీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతా వీరప్రసాద్ మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ, పేదలకు ఈ పథకాన్ని దూరం చేసేలా కుట్రలు చేస్తోందని విమర్శించారు. కూలీల పొట్ట కొట్టేలా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఐక్యంగా తిప్పికొట్టాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి ప్రతి కూలీ పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మే 06 తేదీ అమలాపురంలో రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో కూలీలు వేలాదిగా తరలివచ్చి కేంద్రం చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేట్లు మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Comments
Post a Comment