Skip to main content

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం...


శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, జిల్లా అందత్వ నివారణ సంస్థ విశాఖపట్నం
వారి సౌజన్యంతో, వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో అన్ని రకాల కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందించడం జరిగింది. O.P. కి 150 మంది హాజరు కాగా, 28 మందికి కంటి ఆపరేషన్లకు ఎన్నికయ్యారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు ద్రోణం రాజు.  శ్రీవాత్సవ్, 35 వ వార్డు కార్పొరేటర్, విశాఖపట్నం పార్లమెంట్T.D.P. అధికార ప్రతినిధి విల్లూరి. భాస్కరరావు వైద్య శిబిరంలో పాల్గొని, పేషెంట్లకు ఉచితంగా మందులు అందించడం జరిగింది, ఈ సందర్భంగా శ్రీవత్సవ మాట్లాడుతూ,


 శంకర్ ఫౌండేషన్ వారు చక్కగా దగ్గరుండి తీసుకువెళ్లి, అన్ని రకాల టెస్టులు మరలా చేసి ఆపరేషన్లు చేయించి , మరలా తీసుకొచ్చి సంస్థ దగ్గరికి దించడం జరుగుతుంది అని, ఇంత మంచి సేవలు అందిస్తున్న సంస్థ వాళ్ళని, శంకర్ ఫౌండేషన్ వైద్య బృందాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ, పేషంట్లకు మందులు అందించి, 


వివేకానంద సంస్థ వారు ప్రజలకు అందుబాటులో ఉచిత ఐ క్యాంపులను నిర్వహించి, మానవ సేవే- మాధవ సేవగా, ప్రజల సేవలో తరిస్తున్న సంస్థ వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.  శ్రీ విశాఖ మెడికల్ సెంటర్ ఎం.డి . గుప్తా వైద్య శిబిరానికి ఉచితంగా మందులు అందించారు. ఈ వైద్య శిబిరంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ. అప్పారావు, శంకర్ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ Y. రాజు, ఒప్పో మెట్రిస్ట్:D. శాంతి,K. ప్రసన్న,nursing: విజయ కుమారి మొదలైన వారు పాల్గొన్నారు.

Comments