విశాఖపట్నం, ఏప్రిల్ 18: నగరంలోని సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)ఆంధ్ర విశ్వవిద్యాలయశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్తమ అనుబంధ కళాశాల అవార్డును అందుకొని విశిష్ట ఘనతను సాధించింది.
ఈ పురస్కారం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల (1926–2026) సందర్భంగా AU కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేయబడింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ మరియు వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ హేమ సర్టిఫికేట్ తో పాటు జ్ఞాపికను వైస్ చాన్సలర్ ప్రొఫ్. జి. పి. రాజశేఖర్ రిజిస్ట్రార్ ప్రొఫ్. కె. రాంబాబు చేతుల మీదుగా స్వీకరించారు.
విద్యా రంగంలో కళాశాల అందించిన విశేష సేవలు, నిరంతర అకాడమిక్ ప్రతిభ, సమగ్ర అభివృద్ధికి ప్రతిఫలంగా ఈ అవార్డు లభించింది . సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.
ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ విజయాన్ని తమ సమిష్టి కృషి ఫలితంగా ఆనందంగా జరుపుకున్నారు.
K.V.SHARMA EDITOR
:::


Comments
Post a Comment