ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం లక్ష్యం* *గర్భిణులు & బాలింతల్లో పోషకాహార అవగాహన పెంచడం మన బాధ్యత* *టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోషణపక్వాడ కార్యక్రమం*
కె. వి. శర్మ, ఎడిటర్,
విశాఖపట్నం, ఏప్రిల్ 13:* సమాజంలో ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించాలంటే తల్లి–శిశు సంక్షేమమే మూలాధారం అని గుర్తించిన కూటమి ప్రభుత్వం, పోషకాహార లోప నిర్మూలనపై దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పెందుర్తి పరిధిలో గాజువాకలో నిర్వహించిన పోషణపక్వాడ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం కేవలం ఆరోగ్య కార్యక్రమం మాత్రమే కాదు, అది రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేసే సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పోషణపక్వాడ కార్యక్రమాల ద్వారా ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో తల్లులు, గర్భిణీలు, బాలింతలకు విస్తృత అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
గర్భధారణ నుంచి చిన్నారి రెండేళ్లు నిండే వరకు ఉన్న మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని, ఈ దశలో తల్లి పోషణ, శిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి కుటుంబానికి పోషకాహారం ప్రాముఖ్యతను చేరవేస్తున్నామని తెలిపారు.
“పోషిత్ భారత్” లక్ష్యంతో జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి, సాంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించే దిశగా చైతన్యం కల్పిస్తున్నామని, ప్యాకెట్ ఆహారాల ప్రభావంపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు.
అలాగే 3 నుంచి 6 సంవత్సరాల వయస్సులో పిల్లల మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఈ దశలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పల్లా గారు పేర్కొన్నారు. పిల్లలతో మాట్లాడడం, ఆడించడం, కథలు చెప్పడం ద్వారా వారి అభివృద్ధికి బలమైన పునాది వేయాలని సూచించారు. కుటుంబ స్థాయిలోనే ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు పురుషుల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ల ద్వారా “మొదటి 1000 రోజులు కీలకం”, “జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంటి వంటనే ఆరోగ్యానికి మార్గం”, “పిల్లలతో గడిపే సమయమే వారి భవిష్యత్తు” వంటి సందేశాలను ప్రజలకు చేరవేశారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో పోషణపక్వాడ కీలక పాత్ర పోషిస్తుందని పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు

Comments
Post a Comment