అమలాపురం:విశాఖ సందేసం:అమలాపురం రూరల్ మండలం కామనగరువు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పై డిప్యూటీ ఎంపీడీవో అయిన రుద్రరాజు ఎస్ఎస్ సూరపరాజును కామానగరువు ఇంచార్జ్ కార్యదర్శి బి. ఆదినారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. కామనగరువు పంచాయితీ కార్యాలయం నందు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి డి.ఎల్.పి.ఓ పి.బొజ్జరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పంచాయతీ విభాగంలో పలు శాఖలలో పనిచేసిన సూరపరాజు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల పదోన్నతిలో భాగంగా మలికిపురం డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సూరపరాజు ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని ఆకాంక్షించారు.

నిబద్ధతతో పని చేసి పదోన్నతి పొందిన సూరపరాజును పలువురు పూలమాలలు వేసి పుష్పగుచ్చలను అందించి దుస్సాలువాలతో ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు,జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు శాస్త్రి, రెడ్డి శిరీష, కోడూరి వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి, ఆదినారాయణ, పి శ్రీనివాస్, దారా రామకృష్ణ, అడబాల ఎస్వీఎస్ రాజేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు...
Srinivas Spl Correspondant

Comments
Post a Comment