Skip to main content

గ్రామాల అభివృద్ధికి అవంతి ఫౌండేషన్ కృషి : చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ గోడిలంకలో సోలార్ లైట్లు ప్రారంభోత్సవం....

 .


అవంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాలలో అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషిచేస్తుందని అవంతి మేనేజింగ్ డైరెక్టర్ మరియు అవంతి ఫౌండేషన్ చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ అన్నారు. గోడిలంక మాజీ సర్పంచ్ రుద్రరాజు పవిత్ర  లక్ష్మిపతి రాజు పంచాయతీ కార్యదర్శి వై. ఎమ్  శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోలార్ లైట్ల ప్రారభోత్సవ కార్యక్రమం పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఘనంగా  నిర్వహించారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా అవంతి మేనేజింగ్ డైరెక్టర్ మరియు అవంతి ఫౌండేషన్ చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్, రుద్రరాజు గోపాల కృష్ణరాజు    (గోపిరాజు) లు పాల్గొని సోలార్ లైట్లను ప్రారంభించారు. చైర్మన్ ఇంద్రకుమార్ మాట్లాడుతూ గోడిలంక గ్రామంలో రూ. 12 లక్షలతో   54 సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాలలో మౌళిక సదుపాయాలు కల్పనలో అవంతి ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు.


 అనంతరం ఇంద్రకుమార్, ఆర్.వి. ఎస్ ఎన్ రాజు, రుద్రరాజు బాబులను లక్ష్మిపతి రాజు, వేగిరాజు శ్రీనురాజు పుష్పగుచ్చాలు, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను అందజేసి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. గోడిలంక గ్రామం అభివృద్ధికి కృషిచేసిన మాజీ సర్పంచ్ రుద్రరాజు పవిత్ర లక్ష్మిపతి రాజుకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు


. ఈ కార్యక్రమంలో  ఆర్.వి. ఎస్ ఎన్ రాజు, రుద్రరాజు బాబు, రుద్రరాజు సురేష్ రాజు,  రుద్రరాజు దత్తుడు రాజు, , నాతి శ్రీనివాసరావు,  వాసర్ల బాబురావు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

              Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.