అమరావతి ఏకైక రాజధాని గా చట్టబద్ధతపై సీఎం శ్రీ నారా చంద్రబాబును అభినందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా మరియు తదితరులు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అపార అనుభవం, అభివృద్ధి పట్ల అంకితభావం వల్లే అమరావతి నేడు శాశ్వత రాజధానిగా స్థిరపడిందని పల్లా గారు కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజధాని అంశంపై వెనుకడుగు వేయకుండా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా నిరంతరం కృషి చేసిన నాయకత్వం చంద్రబాబు గారిదేనని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం తరతరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రైతుల త్యాగాలు, ప్రజల దీర్ఘకాలిక పోరాటం ఫలితంగా ఈ రోజు సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే విధంగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
గత వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని పల్లా గారు తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా తీసుకున్న ఆ నిర్ణయాలు ప్రజల్లో అయోమయం సృష్టించాయని పేర్కొన్నారు. ఇప్పుడు అమరావతిని ఏకైక రాజధానిగా స్పష్టత రావడంతో అన్ని అనుమానాలకు తెరపడిందన్నారు.
అమరావతి నిర్మాణంపై ఇంకా గందరగోళ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని పల్లా గారు హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం ఇస్తారని అన్నారు.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు



Comments
Post a Comment