ప్రజా ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం* *వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు* *: వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్*
కె. వి. శర్మ,
ఎడిటర్,
విశాఖపట్నం, ఏప్రిల్ 12: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రాష్ట్రంలో వైద్య రంగం గత రెండేళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆసుపత్రిలో ఎండో బ్రాంకియల్ అల్ట్రా సౌండ్ మెషీన్ (ebus)తో వాటర్ ఫౌంటెన్ ల తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తో కలసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఈ అల్ట్రా సౌండ్ మిషన్ మొదటిదని,దీనివల్ల ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
గడిచిన రెండేళ్లలో ఆసుపత్రుల్లో ఓపి (OP) మరియు ఐపి (IP) సేవలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ చెస్ట్ ఆసుపత్రి లో
2023లో 35,000గా ఉన్న ఓపి సేవలు 2025 నాటికి 45,000కు చేరుకున్నాయని,
మేజర్ సర్జరీల సంఖ్య 359 నుండి 649కి పెరగడం డాక్టర్ లు ,సిబ్బంది అంకితభావానికి నిదర్శనం అని అన్నారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని,
కర్నూలు, విశాఖపట్నం, కడప మరియు గుంటూరులలో అత్యాధునిక క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని,
వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కాకినాడ మరియు అనంతపురంలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లను పూర్తి చేసి క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా కృషి చేస్థామన్నారు.
ఆరోగ్యశ్రీ (NTR వైద్య సేవ) కింద నిధులను భారీగా పెంచడం జరిగిందని. గతంలో 6 లక్షల రూపాయలుగా ఉన్న చెల్లింపులు ఇప్పుడు 3 కోట్ల 76 లక్షలకు పెరిగాయన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పై, డాక్టర్ల పై ప్రజల లో నమ్మకం పెరిగిందన్నారు.
రాష్ట్రంలో ప్రతి మూడు రోజులకు ఒక కొత్త డయాలసిస్ మిషన్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డయాలసిస్ మిషన్ల సంఖ్యను 550 నుండి 725కు పెంచి కిడ్నీ బాధితులకు భరోసా కల్పిస్తున్నామన్నారు.
త్వరలోనే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించేలా 'యూనివర్సల్ హెల్త్ స్కీమ్'ను అమలు చేయబోతున్నా మని,
ఇంతటి భారీ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ పరికరాన్ని సమకూర్చిన ఆసుపత్రి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిపాలనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో విశాఖపట్నం ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త పరికరం ద్వారా పల్మనరీ మెడిసిన్ విభాగంలో విశాఖ మరో మైలురాయిని సాధించిందన్నారు.
ఈ సదుపాయాన్ని సమర్థవంతంగా వినియోగించి, అధిక సంఖ్యలో పరీక్షలు, చికిత్సలు నిర్వహించి, ఉత్తమ పద్ధతులను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా, సిఎస్ఆర్ (CSR) ద్వారా మరిన్ని వనరులను సమీకరించి ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు జిల్లా పరిపాలన కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకోసం వైద్యులు, సంబంధిత సంస్థలు తమ అవసరాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.
దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా విశాఖపట్నాన్ని గ్లోబల్ నగరంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో NTR వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్,రవి కుమార్ ,డా. పుల్లారావు,చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండ్ సునీల్ కుమార్,ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, కె.జి.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, DMHO డా.జగదీశ్వరరావు, డా.రమేష్,ఇతర వైద్య నిపుణులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




Comments
Post a Comment