Skip to main content

అంబేద్కర్ జయంతి వేడుకలు...


 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 39 వ వార్డు, దక్షిణ నియోజకవర్గంలో వివేకానంద సంస్థ వారు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.C.M.A. జహీర్ అహ్మద్, రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు మక్సుద్ అహ్మద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. 


ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతిని “సమానత్వ దినోత్సవం” గా కూడా పిలుస్తారని, అంబేద్కర్ భారతీయ రాజకీయవేత్త, సంఘసంస్కర్త అని తెలియజేశారు. మక్సుద్ మాట్లాడుతూ, అంటరానితనం నిర్మూలించడంలో ఎనలేని కృషి చేశారని, ప్రజలందరూ దేశభక్తితో, సమస్యలను ఎదుర్కొని, సమాజంలో మార్పులు తీసుకురావాలని తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ. అప్పారావు, ప్రముఖ సంఘ సేవకులుT. కృష్ణ మరియు మహిళలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.